యూపీలో తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Uttar Pradesh Assembly Elections

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మొదటివిడతలో యూపీలోని 58 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది, ఈనెల 21తో అభ్యర్థుల నామినేషన్ల గడువు ముగియనున్నది.

ఫిబ్రవరి 10న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొదటి విడత పోలింగ్ జరుగనుంది.