తపోవన్ సొరంగం నుంచి బయటపడుతున్న మృతదేహాలు

ఉత్తరాఖండ్ సొరంగం నుంచి బయటపడుతున్న మృతదేహాలు
ఉత్తరాఖండ్ సొరంగం నుంచి బయటపడుతున్న మృతదేహాలు

ఉత్తరాఖండ్‌ వరద ప్రమాదంలో గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా గాలింపు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. తపోవన్ ప్రాజెక్టు సొరంగం వద్ద చిక్కుకున్న 30 మంది కోసం అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు సొరంగం నుంచి బురదను బయటకు తీస్తూ.. మరోవైపు సొరంగానికి రంధ్రాలుచేస్తున్నారు.

 

ఏడోరోజుకు చేరుకున్న గాలింపు చర్యల్లో భాగంగా ఆదివారం నాడు మూడు మృతదేహాలు బయటకు తీశారు. కాగా.. ఇప్పటి వరకు బయటకు తీసిన మృతదేహాల సంఖ్య 41కి చేరింది. మిగిలిన వారి ఆచూకీ కోసం సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారి తివారి తెలిపారు. ప్రాణాలతో బయటపడ్డ వారిని.. తక్షణమే ఆస్పత్రికి తరలించేందుకు హెలికాప్టర్ సిద్ధంగా ఉంచామన్నారు.