బీజేపీని గెలిపించిన రేవంత్ రెడ్డి? కోమటిరెడ్డి కామెంట్స్ మర్మం ఇదేనా?

revanth-reddy-and-komati-reddy

komati-reddy-and-revanth-reddy

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయామా? ఈటెల రాజేందర్ ను గెలిపించడం కోసం కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి బొంద పెట్టిండా? ఈ ప్రశ్నలకు భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అవుననే అంటున్నడు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న కాన్సెప్ట్ లో బీజేపీకి సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చిందని కోమటిరెడ్డి చెప్పుకున్నడు.. టీఆర్ఎస్ ను ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో బీజేపీకి మద్దతిచ్చామన్నారు కోమటిరెడ్డి. ఇప్పుడు ఈ కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయ్యాయి.

అనామక లీడర్ ను పోటీలోకి దించడం వెనుక కుట్ర?

హుజురాబాద్ లో కాంగ్రెస్ కు పోల్ అయిన ఓట్లు కూడా కోమటిరెడ్డి మాటల్ని బలపరుస్తున్నాయి. పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 60 వేల ఓట్లు వచ్చినయి. ఈసారి మాత్రం ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ఇండిపెండెంట్స్ కంటే తక్కువ ఓట్లు వచ్చినయి. కాంగ్రెస్ పార్టీకి ఉండే సాలిడ్ ఓట్లు కూడా ఈసారి బల్మూరి వెంకట్ కు పడలేదు. ఏ పరిస్థితుల్లో అయినా చెక్కుచెదరని కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ను కూడా బీజేపీకి మళ్లించారన్న విమర్శలు మొదలయ్యాయి. ఈ ఓట్ బ్యాంక్ తనకు పడితే ఈజీగా గెలవొచ్చని ఈటెల భావించిండు. ఇందుకోసమే కాంగ్రెస్ బడా నేతతో అక్రమంగా ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నయి. చివరి వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడం, కొండా సురేఖ లాంటి బలమైన నేతను కాదని బల్మూరి వెంకట్ లాంటి అనామక లీడర్ ను పోటీలోకి దించడం వెనుక కుట్ర ఉందని కాంగ్రెస్ కార్యకర్తలే అనుమానిస్తున్నరు. వీటన్నింటిని పరిశీలిస్తే  ఈటెల, రేవంత్ రెడ్డి ఓ హోటల్ లో రహస్యంగా కలిశారన్న ఆరోపణలు నిజమే కావొచ్చని సోషల్  మీడియాలో కొంతమంది నెటిజన్స్ పోస్టులు పెడుతున్నరు.

voral-posts3

కాషాయ పార్టీకి రేవంత్ సపోర్ట్?

వచ్చే జనరల్ ఎన్నికల్లో బీజేపీ ని ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కిందా మీదా పడుతున్నరు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతన్నరు. ఈ క్రమంలో తమ పార్టీలో ఉన్న ఇంటిదొంగలను కూడా వదలడం లేదు. ఆర్.ఎస్.ఎస్ అంటే అభిమానం ఉన్న నాయకులు మర్యాదగా పార్టీ నుంచి వెళ్లిపోవాలని అప్పట్లో రాహుల్ ప్రకటించిండు. ఈ నేపథ్యంలోనే ఆర్.ఎస్.ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వొద్దని కొంతమంది కాంగ్రెస్ సీనియర్ లీడర్లు వాదించిన్రు. ఎందుకో పార్టీ హైకమాండ్ వారి మాట వినలేదు. హుజురాబాద్ బై పోల్ లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోవడానికి ఆ నేపథ్యమే ప్రధాన కారణమని విమర్శలు కాంగ్రెస్ లో జోరందకున్నయి. ఈటెల ను గెలిపించడం కంటే తెలంగాణలో బీజేపీ కి హైప్ తీసుకురావాలన్న లక్ష్యంతోనే హుజురాబాద్ బై పోల్ లో కాషాయ పార్టీకి సపోర్ట్ చేసి ఉండొచ్చన్నది కొంతమంది సీనియర్ లీడర్ల అభిప్రాయం.

బీజేపీకి సపోర్ట్ పైనే ఎక్కువ చర్చ

తాజా ఎన్నికల ఫలితంతో రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే సీనియర్లు మళ్లీ వాయిస్ పెంచుతున్నరు. కాంగ్రెస్ కు ద్రోహం చేసే వారిని బయటకు పంపిస్తేనే పార్టీకి పూర్వ వైభవం వస్తుందంటున్నరు. హుజురాబాద్ లో బీజేపీకి సపోర్ట్ చేయడంపై రేపో, మాపో ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తామని ఆఫ్ ది రికార్డ్ చెపుతున్నరు. మొత్తానికి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓడిపోవడం కంటే, బీజేపీకి సపోర్ట్ చేయడంపైనే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ చర్చ నడుస్తోంది.