హుజురాాబాద్ కాంగ్రెస్ టికెట్ ను రేవంత్ రెడ్డి ఎంతకు అమ్ముకున్నాడో తెలుసా!

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ రెండూ కుమ్మక్కు కావడం వల్లనే టీఆర్ఎస్ ఓడిపోయిందని టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హుజురాబాద్ కాంగ్రెస్ టికెట్ ను రూ.25 కోట్లకు అమ్ముకున్నాడని.. దేశవ్యాప్తంగా రెండు జాతీయ పార్టీలు కొట్టుకుంటూ ఇక్కడ మాత్రం చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆయన ఆరోపించారు.


ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో హుజురాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 62వేల ఓట్లు వచ్చాయని గుర్తుచేశారు. ప్రస్తుత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం వల్ల కాంగ్రెస్ కు పడాల్సిన ఓట్లన్నీ బీజేపీకి మళ్లించారని ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ ఎన్నికల్లో కేవలం 3వేల ఓట్లు మాత్రమే సాధించారని ఆయన అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ 84వేల ఓట్లు సాధించారని.. ప్రజల ఆదరాభిమానాలు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయని.. ఎన్ని చీకటి ఒప్పందాలు చేసుకున్నా టీఆర్ఎస్ ని ఏం చేయలేరని ఆయన అన్నారు.