బీజేపీ పార్టీతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యాడు.. పాడి కౌశిక్ రెడ్డి

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మాచాన్ పల్లి గ్రామంలో నిర్వహించిన ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీధర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డప్పు చప్పుళ్ళు, బోనాలు, కోలాటలతో గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ తో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యాడు. అందుకే కాంగ్రెస్ నుండి బయటకు వచ్చాను. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం గెల్లు శ్రీనన్న, నేను కలిసి పనిచేస్తాము. ఈటల అవినీతి సొమ్ముతో ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డాడు.

ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ప్రతి కుటుంబానికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. సీఎం కేసీఆర్ బలపరిచిన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించండి. గెల్లు శ్రీనివాస్ ను గెలిపిస్తే హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి పరుగులు పెడుతుంది. కారు గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని సీఎం కేసీఆర్ పంపించారు. హుజురాబాద్ నియోజకవర్గం కు నాలుగు వేల ఇండ్లు కేటాయించారు. ఈటల రాజేందర్ ఇండ్ల కట్టించలేదు. నాకు అవకాశం ఇవ్వండి. రాబోయే రెండున్నర సంవత్సరాల కాలంలో పేదలకు ఇండ్లు కట్టిస్తాను. నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాను. మాచాన్ పల్లి గ్రామంలో కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో పనులు చేపట్టాము. హుజురాబాద్ నియోజకవర్గం కు 100 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేస్తానని హామీ ఇస్తున్నాను అని అన్నారు.