మల్లిక్ పరుచూరికి వర్మ సప్పోర్ట్…! - TNews Telugu

మల్లిక్ పరుచూరికి వర్మ సప్పోర్ట్…!



RGV Apologies to Mallik Paruchuri First Time
RGV Apologies to Mallik Paruchuri First Time

మందు లేదు, సరైన వైద్యం దొరకడంలేదు, టీకాలు అందుబాటులో లేవు.. కరోనా వైరస్ క్రియేట్ చేసిన ఈ టెర్రర్ సిచువేషన్స్ లో కొంత మంది ప్రజలకు ఆపద్బాంధవుడిలా కనిపించిన వ్యక్తి మల్లిక్ పరుచూరి. స్వతహాగా కెమికల్ ఇంజనీర్ అయిన మల్లిక్,  కరోనా వైరస్ ని ఎదుర్కోవడంలో ప్రజలకి ఒక భరోసా కలిగిస్తూవస్తున్నాడు. ముఖ్యంగా కరోనాకు విరుగుడుగా వంటింటి చిట్కాలను చెప్తూ సోషల్ మీడియాలో ఫెమస్ అయ్యాడు మల్లిక్ పరుచూరి.

గతంలో లక్షల్లో పలికిని రెమిడీసీవర్ వంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ ని వ్యతిరేకించి మెడికల్ మాఫియాపై ఎదురొడ్డి పోరాడాడు అన్న పేరుంది ఇతనికి. మరి వారి ఆదాయాన్ని గండి కొడుతుంటే నష్టపోతున్నమెడికల్ మాఫియా కాలిగా ఉండదు కదా.. రెండు మూడు రోజుల నుండి టాప్ మీడియా టెలివిజన్స్ లో మల్లిక్ పై వీరంతా ఎదురుదాడికి దిగారు. సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంటుందని , సైన్టిఫిక్ సాక్షాలు లేకుండా ప్రజలను మల్లిక్ భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని ప్రజల్లో   ఒక ఫెక్ ఫీల్ ని క్రియేట్ చేశారు.

ఇక ఈ యాంటీ మల్లిక్ గ్రూప్ లో తెలిసో తెలియకనో సెలబ్రెటీలు కూడా చేరిపోయారు. ముఖ్యంగా ఆర్జీవీ వంటి వారు కూడా మల్లిక్ పై నెగిటీవ్ ట్వీట్స్ పెట్టి పెట్టాడు. ప్రజలను బయపెడుతున్నాడని వర్మ ట్వీట్ చేసాడు. అయితే వర్మతో పాటు తనని వ్యతిరేకిస్తున్న అందరికి  కౌంటర్ గా మల్లిక్ మరింత పట్టుదల కనబరిచారు. అరెస్ట్ అవుతే కానివ్వండి, కానీ నేనైతే ప్రజలకు నిజాలు చెప్తూనే ఉంటానని , సైన్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్లే విజిల్ బ్లోయర్ లా ఉంటానని , కచ్చితంగా కరోనా థర్డ్ వేవ్ ప్రళయం ఉంటుందని, దానికి సంబదించిన వైరస్ మ్యుటేషన్స్ పేర్లు చెప్పి మరి డాక్టర్స్ కి కౌంటర్ ఇచ్చాడు మల్లిక్.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..   మల్లిక్ చేసిన రీసర్చ్, సజెస్ట్ చేస్తున్న కరోనా రెమిడీస్, చెప్తున్న కొత్త మ్యుటేషన్స్ పేర్ల గురించి చాలా మంది డాక్టర్లకు కూడా తెలీదని , టీవీలో కొందరు బడా డాక్టర్స్ ఒప్పుకోవటం జరిగింది. వైరస్ లోడ్ తగ్గించడానికి, చిన్నపిల్లకు వైరస్ సోకితే చేసే వైద్యం గురించి టీవీ డిబేట్స్ లో మల్లిక్ వేసిన సూటి ప్రశ్నలకు సమాదానాలు లేక డాక్టర్లకు చమటలు పట్టాయి. మొన్నటివరకు మల్లిక్ కరోనా ప్రోటోకాల్ ని విమర్శించినవారు కూడా నేడు కళ్ళు తెరుచుకున్న పరిస్థితి . భయపెడితేనే సమాజంలో మార్పు వస్తుందని , లేదంటే ప్రజల విచ్చలవిడితనంతో ప్రళయం రావొచ్చని, భయం కంటే ప్రాణం గొప్పదని ఇప్పుడు అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. అనూహ్యంగా మల్లిక్ పరుచూరికి మద్దత్తు పెరిగింది.

ఇక తాను ముందు చేసిన ట్వీట్స్ కి సమాదానాలు ఇచ్చాడు వర్మ. రీసెంట్ గా మల్లిక్ పరుచూరి పాల్గొన్నఒక మీడియా డిబేట్ లో పాల్గొన్న వర్మ మల్లిక్ పరుచూరికి పూర్తి మద్దత్తు తెలిపాడు. తన ప్రీవియస్ ట్వీట్స్ ని అందరు తప్పుగా అర్ధం చేసుకున్నారని వర్మ వరుసగా రీ ట్వీట్స్ చేయటమే కాకుండా ఆ డిబేట్ లో డైరెక్టర్ గా మల్లిక్ గారిని అభినందించారు. ఇక వర్మ చేసిన పాజిటీవ్ కామెంట్స్ కి మల్లిక్ పరుచూరి కూడా ధన్యవాదాలు తెలియజేశాడు. ఇక ఏదేమైనా ఇప్పుడు మనముందున్న పెను సవాల్ కరోనా థర్డ్ వేవ్… తాను చెప్తున్న సలహాలను పాటిస్తూ, థర్డ్ వేవ్ కి భయపడకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదని మల్లిక్ పరుచూరి ప్రజలకు చెప్పటం జరిగింది.

https://twitter.com/RGVzoomin/status/1403433222239752194