మరో వివాదంలో చిక్కుకున్న రిహానా

ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల ఆందోలనపై ట్వీట్ చేసి.. సంచలనం సృష్టించిన పాప్ సింగర్ రిహానా తాజాగా మరో సంచలనానికి కేంద్రబిందువైంది. మెడలో గణేషుడి లాకెట్ వేసుకొని.. టాప్ లెస్ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫొటోలు ట్విటర్లో షేర్ చేసి.. మరో వివాదానికి కారణమైంది. గతంలో రైతుల ఫొటోలను షేర్ చేస్తూ.. దీనిపై ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించిన రిహానా.. ఇప్పుడు టాప్ లెస్ ఫొటో షేర్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఆమె ట్వీట్ చేసిన ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.