దేవుడికే శఠగోపం పెట్టిన దొంగలు.. బంగారు నగలు, నగదు మాయం

Robbery in Sai Baba temple in chanda nagar
Robbery in Sai Baba temple in chanda nagar

హైదరాబాద్ లోని చందా నగర్ పీఎస్ పరిధిలోని అన్నపూర్ణ ఎన్ క్లేవ్ సాయిబాబా దేవాలయంలో చోరీ జరిగింది. సోమవారం తెల్లవారుఝామున 4శ30 గంటల ప్రాంతంలో ఆలయం ప్రధాన ద్వారానికి వేసి ఉన్న తాళం పగులగొట్టిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో 4 తులాల బంగారు ఆభరణాలు, 30 వేల నగదు దోచుకెళ్లారు.

Robbery in Sai Baba temple in chanda nagar
Robbery in Sai Baba temple in chanda nagar

సీసీ కెమెరా వైర్లను కత్తిరించిన దుండగులు సాయిబాబా చెవి కమ్మలు, బంగారు బొట్టుతో పాటు 30వేల నగదు, రెండు చిన్న హుండీలు దోచుకెళ్లారు. ఆలయ ప్రాంగణంలో నివసించే పూజారుల ఇళ్లకు బయటి నుంచి గడియ పెట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.