ఏడు వికెట్ల తేడాతో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మ్యాచ్ కూడా ఈజీగా గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసే అవకాశాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కి బెంగళూరు… నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 164 పరుగుల లక్ష్యాన్ని ఊది పారేసింది. చివరి బంతికి సిక్స్ కొట్టిన శ్రీకర్ భరత్ ఆర్సీబీకి విజయాన్ని కట్టబెట్టాడు. ఓపెనర్లుగా బ్యాటింగ్ కి దిగిన విరాట్ కొహ్లీ కేవలం 4 పరుగులు కొట్టి ఔట్ కాగా.. మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ అసలు ఖాతానే తెరవలేదు.

ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కి వచ్చిన వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ భీభత్సమైన బ్యాటింగ్ తో రాయల్ ఛాలెంజర్స్ అలవోకగా గెలిచింది. 52 బంతులాడిన శ్రీకర్ భరత్ 3 ఫోర్లు, 4 సిక్సులతో 78 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన డివిలియర్స్ 26 బంతుల్లో 26 పరుగులు చేయగా.. మ్యాక్స్ వెల్ వీరబాదుడుకు 33 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఎన్రిచ్ నోర్ట్జే 2 వికెట్లు తీయగా.. అక్సర్ పటేల్ 1 వికెట్ తీశాడు.