టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్

ఎలిమినేటర్ మ్యాచ్ లో ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. కలకత్తా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కొహ్లీ ముందుగా బ్యాటింగ్ చేసేందుకు ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు క్వాలిఫై మ్యాచ్ కి అర్హత సాధిస్తారు. ఓడిన వారు ఇంటిబాట పట్టక తప్పదు. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మా జట్టులో యువ ఆటగాళ్లు గెలుపు కోసం ఉత్సాహపడుతున్నారు. ఈ మ్యాచులో గెలిసే శక్తి మాకుంది. టీమ్ లో ఎలాంటి మార్పులు లేవు. ఎలిమినేషన్ మ్యాచ్ లో మేం గెలిచి కలకత్తాను ఇంటికి పంపిస్తాం అన్నాడు కోహ్లీ. టాస్ ఓడిన నైట్ రైడర్స్ కెప్టెన్ మాట్లాడుతూ.. మాకు ఫస్ట్ బౌలింగ్ చేయడమే ఇష్టం. టాస్ ఓడిపోవడం గురించి అస్సలు బాధపడటం లేదు. మ్యాచ్ మేమే గెలుస్తాం. మా జట్టులో ఎలాంటి మార్పులు లేవు. మేం బలంగా ఉన్నాం.. బలంగా ఆడుతాం అన్నాడు.

 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ (సి), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భరత్ (డబ్ల్యూ), గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, షాబాజ్ అహ్మద్, జార్జ్ గార్టన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

కలకత్తా నైట్ రైడర్స్ : శుభమాన్ గిల్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఇయోన్ మోర్గాన్ (సి), దినేష్ కార్తీక్ (w), షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చాకరవర్తి