రాయల్ ఛాలెంజర్స్ లక్ష్యం 20 ఓవర్లలో 165 పరుగులు

 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలుత బ్యాటింగ్ చేసే అవకాశాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కి ఇచ్చింది. నిర్ణీత ఇరవై ఓవర్లలో ఢిల్లీ బ్యాట్స్ మెన్లు 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు కొట్టారు. ఓపెనర్లు 31 బంతుల్లో (4 ఫోర్లు, 2 సిక్సులు) 48 పరుగులు, శిఖర్ ధావన్ 35 బంతుల్లో (3 ఫోర్లు, 2 సిక్సులు) 43 పరుగులు కొట్టి శుభారంభాన్నిచ్చారు.

రిషబ్ పంత్ 10, శ్రేయాస్ అయ్యర్ 29, హెట్మేయర్ 29 పరుగులు చేయగా.. నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కాగా రాజస్థాన్ రాయల్స్ గెలువాలంటే 20 ఓవర్లలో 165 పరుగులు చేయాలి.