
ఐపీఎల్ రెండో సీజన్ దుబాయ్ లో గ్రాండ్ గా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. నిన్న తలపడిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచులో చెన్నై విజయ బావుటా ఎగురవేసింది. కాగా నేడు రెండో మ్యాచ్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. తొలి దశలో రాయల్ ఛాలెంజర్స్ చేతిలో ఎదురైన ఓటమికి బదులివ్వాలనే కసితో కోల్ కతా బరిలోకి దిగింది. వరుస ఓటములతో సతమతమవుతున్న కోల్ కతా నైట్ రైడర్స్ ఈ సీజన్ లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేయనుంది. కాగా.. ఈ మ్యాచ్ విరాట్ కొహ్లీకి 200 ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు..
విరాట్ కోహ్లి (కెప్టెన్), ఏబీ డి విలియర్స్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, దేవ్‌దత్ పడిక్కల్, కేఎస్ భరత్, వనిందు హసరంగ, కైల్ జెమీసన్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, సచిన్ బేబీ, యుజువేంద్ర చాహాల్
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు..
వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రానా, సునీల్ నరైన్, శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), ఆండ్రూ రస్సెల్, దినేశ్ కార్తిక్ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, లాకీ ఫెర్గుసన్, ప్రసిద్ధ్ కృష్ణ