టాస్ గెలిచిన బెంగళూరు.. బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్

ఈ రోజు దుబాయ్ వేదికగా జరుగుతున్న రెండు మ్యాచుల్లో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచులో బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లుగా శిఖర్ ధావన్, పృథ్వీ షా ఇద్దరూ బ్యాటింగుకు దిగారు. 14ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే సమయంలో ఒకే రోజు రెండు మ్యాచ్‌లు నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ లీగ్‌లో ఆర్సీబీ, ఢిల్లీ జట్లు 26 మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడగా.. ఆర్సీబీ 15 మ్యాచ్‌ల్లో.. ఢిల్లీ 10 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఈ సీజన్‌ తొలిదశలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో 1పరుగు తేడాతో ఆర్సీబీ గెలిచింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కొహ్లీ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), డానియెల్ క్రిస్టియన్, గ్లెన్ మ్యాక్స్ వెల్, ఏబీ డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, జార్జ్ గార్టన్, మహ్మద్ సిరాజ్, జయజువేంద్ర చాహల్

ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), రిపాల్ పటేల్, సిమ్రాన్ హెట్మీర్, ఆక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడ, ఆవేశ్ ఖాన్, ఎన్రిచ్ నార్ట్జే