మరో రికార్డు క్రియేట్ చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్’

ఇప్పటికే పలు రికార్డులు సొంతం చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’ తాజాగా మరో రికార్డును దక్కించుకుంది. జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ముఖ్యపాత్రల్లో మల్టీస్టారర్‌గా జక్కన్న దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ భారీ బడ్జెట్‌ చిత్రంగా రూపొందింది. ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. విజువల్‌ ఎఫెక్ట్స్‌, మ్యూజిక్‌, యాక్టింగ్‌.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదనిపించింది. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రస్తుతం ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌‎లో ఈ చిత్రం తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్‌ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌‎లో హిందీ వెర్షన్‎లో రిలీజ్ అయిన ఈ సినిమా .. ఏకంగా 45 మిలియన్‌ అవర్స్‌ స్ట్రీమింగ్‌ అయిందని సదరు ఓటీటీ ప్రకటించింది. తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డు కొట్టినట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్‌లో మే 20 నుంచి స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ మూవీ ఇప్పటివరకు 45 మిలియన్‌ అవర్స్‌ స్ట్రీమింగ్‌ అయి.. అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్‌ సినిమాగా రికార్డు క్రియేట్‌ చేసినట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది.