తప్పు చేశాను.. మళ్ళీ రిపీట్ అవ్వదు.. తమిళులకి రాజమౌళి క్షమాపణలు.. అసలేం జరిగింది ?

RRR Movie Janani Song Launch Rajamouli Apologizes To Tamil Media
RRR Movie Janani Song Launch Rajamouli Apologizes To Tamil Media

భారత చలనచిత్ర రంగంలో ఓటమి ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పటివరకు దర్శకత్వం వహించిన 11సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిస్తే.. బాహుబలికి ప్రపంచఖ్యాతి వచ్చింది. ఇక అదే జోరులో ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రంతో మరో ఫ్యాన్ ఇండియా చిత్రం తీశాడు రాజమౌళి. సినిమాలకి ఎంత ఖర్చు పెడతాడో అంతే పగడ్బందీగా పబ్లిసిటీ ప్లాన్స్ చేసుకుంటాడు రాజమౌళి. అన్ని భాషల వారికి కనెక్ట్ అయ్యేలా చేసే రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీస్ అద్భుతమని చెప్పొచ్చు. సినిమా డైరెక్షన్ తో పాటు.. తన ప్రోడక్ట్ పబ్లిసిటి లెక్కలు తెలిసిన కొద్దిమంది డైరెక్టర్లలో రాజమౌళి టాప్ లో ఉంటాడు. ఈ విషయం మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు రాజమౌళి. ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం నుండి జనని పాట రిలీజ్ కోసమని దేశమంతా చక్కర్లు కొడుతున్నాడు రాజమౌళి. తన వైరల్ ఫీవర్ ని కూడా లెక్కచేయకుండా.. ముంబై, బెంగుళూరు, కేరళకి వరుసగ తిరుగుతున్నా.. చెన్నైలో మాత్రం రాజమౌళి ఒకింత ఎమోషనల్ అయిపోయాడు.

ఇప్పటివరకు తమిళ మీడియాకి సమయం కేటాయించనందుకు క్షమాపణలు కోరుతున్నా.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో తప్పకుండ టైం ఇస్తాను అంటూ అక్కడి మీడియాని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. బెంగళూరులోని యశవంతపురంలోని ఓరియన్ మాల్ లో జనని కన్నడ పాటను విడుదల చేసి.. కన్నడలోనే స్పీచ్ ఇచ్చి.. కన్నడిగులను ప్రసన్నం చేసుకున్నాడు జక్కన్న. తాజాగా “ఆర్ఆర్ఆర్”ను సమర్పిస్తున్న బ్యానర్ అయిన లైకా ప్రొడక్షన్స్ అధికారులు చెన్నైలో నిర్వహించిన ‘జనని’ తమిళ వెర్షన్ ‘ఉయిరే’ లాంచ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా తమతో ఇంటరాక్ట్ కానందుకు తమిళ సినీ మీడియా సోదరులకు మొదట క్షమాపణలు చెప్పారు. జనవరిలో సినిమా విడుదలకు ముందు జరిగే గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్‌లో తప్పకుండా వారితో సంభాషిస్తానని రాజమౌళి వారికి హామీ ఇచ్చారు.