‘దళితబంధు’కు మరో 250 కోట్లు విడుదల

In the wake of heavy rains, CM KCR review with CS Somesh Kumar

దళితుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న దళితబంధు పథకం కోసం సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు రూ.250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిధుల విడుదల ఉత్తర్వులు జారీ చేశారు.

రూ. 100 కోట్ల నిధులను ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలానికి, రూ. 50 కోట్లను సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లోని తిర్మలగిరి మండలానికి, రూ. 50 కోట్లు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గాలలోని చారగొండ మండలానికి, రూ.50 కోట్లు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలానికి నిధులను విడుదల చేశారు.