రైతుబంధు కింద రూ.7298.83 కోట్లు జమ: మంత్రి నిరంజన్ రెడ్డి

currency-notes

రైతుబంధు కింద ఇప్పటివరకు 60.75 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.7298.83 కోట్లు జమ చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. గురువారం  18 వేల మంది రైతుల ఖాతాలలో 2.40 లక్షల ఎకరాలకు గాను రూ.120.16  కోట్లు జమ చేసినట్టు మంత్రి వివరించారు.

మొత్తం ఇప్పటి వరకు 145.98 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం అందించినట్టు మంత్రి చెప్పారు. ఈ విడతలో ఇప్పటి వరకు 63 లక్షల 25 వేల 695 మంది రైతులకు రూ.7508.78 కోట్లకు గాను.. 60.75 లక్షల మంది రైతులకు రూ.7298.83 కోట్లు జమ చేసినట్టు మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు.