రైతుబంధు కింద రూ.7360.41 కోట్లు జమ

What did BJP do for sacrificial Telangana , questions Minister Niranjan Reddy

రైతుబంధు కింద 60.84 లక్షల మంది రైతులకు రూ.7360.41 కోట్లు జమ చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. 147.21 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు పంపిణీ చేశామన్నారు. మిగిలిపోయిన రైతులు తమ ఖాతాల వివరాలు సమర్పించనట్లయితే వారికి కూడా అందజేస్తామన్నారు. ఇంకా రైతు బంధు రానివారు స్థానిక ఏఈఓలను సంప్రదించాలని మంత్రి సూచించారు.

ఖాతాలు సమర్పించిన రైతులకు వారి వారి ఖాతాలలో నిధులు జమ చేయబడతాయన్నారు. రైతుబంధు నిధులను బ్యాంకర్లు పాతబాకీల కింద జమ చేసుకోవద్దని మంత్రి కోరారు.  జమ చేసుకున్న బ్యాంకులు తిరిగి రైతులకు అందజేయాలని సూచించారు. ఇదివరకే వ్యవసాయ శాఖ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీని రైతుబంధు నిధులు బ్యాంకులు జమ చేసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరడం జరిగిందన్నారు.