దండారీ గుస్సాడీ ఉత్సవాల నిర్వహణకు రూ.కోటి మంజూరు

Chief Minister KCR shocked by Kothapalli house collapse incident

Dandari-Gussadi-festival

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దీపావళి సందర్భంగా ప్రతిఏటా ప్రతిష్టాత్మకంగా ఆదివాసీ గోండులు జరుపుకునే దండారీ గుస్సాడీ ఉత్సవాల నిర్వహణకు ముఖ్యమంత్రి కేసీఆర్.. కోటి రూపాయలు మంజూరు చేశారు.

అటవీశాఖ, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు విజ్జప్తి మేరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దండారీ పండుగ నిర్వహించే ప్రతి గోండు గూడానికి 10 వేల రూపాయల చొప్పున ఈ నిధులను ప్రభుత్వం అందచేస్తుంది.