ఇండస్ట్రీలో కలకలం.. ఆ నీచపు పనిచేస్తూ.. అడ్డంగా దొరికిన సాహో బ్యూటీ.. కేసు నమోదు.!

Saaho Fame Jacqueline Fernandez questioned by Enforcement Directorate in money laundering case
Saaho Fame Jacqueline Fernandez questioned by Enforcement Directorate in money laundering case
Saaho Fame Jacqueline Fernandez questioned by Enforcement Directorate in money laundering case
Saaho Fame Jacqueline Fernandez questioned by Enforcement Directorate in money laundering case

డ్రగ్స్, పోర్న్ కేసులతో బాలీవుడ్ అట్టుడికిపోతోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ తో తెరమీదికొచ్చింది డ్రగ్స్ మ్యాటర్. అది మరవకముందే రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ ఇష్యు. ఈ కేసు అయితే బాలీవుడ్ ని ఒక కుదుపు కుదిపింది.  ఇంకా ఈ కేసు విచారణ సాగుతున్నప్పుడే బాలీవుడ్ లో మరో నీచపు పని చేస్తూ దొరికిపోయింది బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్. డ్రగ్స్, పోర్న్ కి మించిన మనీ లాండరింగ్ కేసులో ఈ బ్యూటీ అడ్డంగా ఇరుక్కుంది. సుకేష్ చంద్రశేఖర్ అనే హవాలా దందాను నిర్వహించే బడా వ్యాపారవేత్త పై అనుమానంతో విచారణ సాగించిన పోలీసులకి దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హవాలా దందా అనుమానంతో సుఖేష్ ఇంటిపై మీద దాడులకి దిగిన ఈడీకి కీలక ఆధారాలు లభ్యమవ్వగా.. బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ తోను సుఖేష్ కి దెగ్గర సంబంధాలు ఉన్నట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ వార్తతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది బాలీవుడ్. ఇప్పటికే అండర్ వరల్డ్ మాఫియాతో బాలీవుడ్ సంబంధాలు ఉంటాయని వినగా ఇప్పుడు దేశద్రోహం కిందవచ్చే ఈ మని లాండరింగ్ క్రైమ్ లోను బాలీవుడ్ సెలబ్రెటీల పేర్లు వస్తున్నాయి. అయితే ఈ కేసుతో లింక్ అయి ఉన్న పారిశ్రామికవేత్త సుఖేష్ తో జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు దగ్గరి సంబంధాలు ఉండటంతో సోమవారం ఆమెను కూడా విచారించింది ఈడీ. దాదాపు 5 గంటలకు పైగా ఈ విచారణ కొనసాగినట్లు తెలుస్తోంది. అయితే ఆమెపై ఎలాంటి ప్రశ్నలు సంధించారు? ఏయే విషయాలపై ఫోకస్ పెట్టారనేదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఒక చెన్నై పారిశ్రామికవేత్త నుండి 200కోట్ల డబ్బుని హవాలా రూపంలో విదేశాలకి తరలించారనే ఆరోపణలతో సుఖేష్ ఇంట్లో ఈడీ దాడి చేయగా రూ.82.5 లక్షల నగదు, రెండు కిలోల బంగారం, డజనుకు పైగా లగ్జరీ కార్లు సీజ్ చేశారు.సుఖేష్ తో జాక్వలిన్ కి కూడా లావాదేవీలు ఉన్నట్టు విచారణ లో బయటికొచ్చింది. అయితే మరెందరో బాలీవుడ్ సెలబ్రెటీలతో జాక్వలైన్‌కు హవాలా దందాతో సంబందాలున్నటు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. దీంతో ఒక్కసారిగా ఈ కేసు బీ టౌన్‌లో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో కలిసి రామ్ సేతు, బచ్చన్ పాండే సినిమాలు చేస్తున్న జాక్వలిన్ ప్రభాస్ సాహో మూవీ లోని బ్యాడ్ బాయ్ సాంగ్ తో టాలీవుడ్ కీ దెగ్గరయ్యింది.