టీమిండియాలో మతం చిచ్చు.. షమీ పాకిస్తాన్ పో.. అంటూ దారుణ విమర్శలు.. మండిపడ్డ సచిన్ సెహ్వాగ్..!

Sachin, Sehwag Back Mohammed Shami Online Abuse After India-Pakistan Match
Sachin, Sehwag Back Mohammed Shami Online Abuse After India-Pakistan Match
Sachin, Sehwag Back Mohammed Shami Online Abuse After India-Pakistan Match
Sachin, Sehwag Back Mohammed Shami Online Abuse After India-Pakistan Match

పాకిస్తాన్ చేతిలో కోహ్లీ సేన ఓటమిని జీర్ణించుకోలేక టీమిండియా వెన్నుముక బౌలర మహమ్మద్ షమీపై కొందరు నెటిజన్స్ జాత్యహంకార వ్యాఖ్యలకి దిగుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుంటే మమ్మల్ని నిండాముంచేశారని కోహ్లీ సేనపై కూడా విమర్శల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా షమీని టార్గెట్ చేస్తున్నారు. అతడు వేసిన 3.5 ఓవర్లలో 43 పరుగులు వచ్చాయి. దీంతో ఓటమికి షమిని బాధ్యుడిని చేస్తూ.. నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. సోషల్ మీడియాలో అతడికి వ్యతిరేకంగా వేలాది మంది పోస్టులు పెడుతున్నారు. మరీ దారుణంగా అతడి మతాన్ని కూడా టార్గెట్ చేస్తూ.. కామెంట్లు పెడుతున్నారు. పాకిస్తాన్‌పై షమీ పక్షపాత ధోరణిని ప్రదర్శించాడని, తోటి ముస్లిం జట్టు కావడం వల్లే తన స్థాయికి తగ్గట్టుగా సత్తా చాటలేకపోయాడంటూ చెత్త కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరికొందరు నెటిజన్స్ ఐతే బుద్ధిలేకుండా.. షమీ నువ్వు పాకిస్తాన్ వెళ్లి ఆడాలి అంటూ దారుణ కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై షమీకి మరోవైపున భారీ ఎత్తున మద్దత్తు కూడా లభిస్తుంది.

ఇప్పటివరకు షమి సాధించిన అప్రతిహత పర్ఫార్మెన్స్ లను మర్చిపోయి కేవలం ఈ ఒక్క మ్యాచ్ విఫలమైనందుకు షమీని తిట్టడం సహించరాని నేరం.ఈ విషయంలో టీమిండియా మాజీ ఆటగాళ్లు కూడా షమీకి మద్దతుగా నిలుస్తున్నారు. సచిన్, సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్ వంటి ప్లేయర్స్ సోషల్ మీడియాలో షమీపై దాడిని ఖండిస్తున్నారు. ముఖ్యంగా భారత మాజీ ఆటగాడు సెహ్వాగ్ షమీకి మద్దతుగా ట్వీట్ వేశాడు. జట్టు ఓటమికి షమీని ఒక్కడినే బాధ్యుడిని చేయడం… వ్యక్తిగతంగా, మతంపరంగా అతడిని దూషించడం తనకు షాక్‌కు గురిచేసిందని తెలిపారు. షమీకి నైతికంగా అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. షమీ ఒక ఛాంపియన్ అని.. ఇండియా టోపీ ధరించిన ప్రతి ఒక్కరూ.. వారి హృదయాలలో దేశం పట్ల భక్తిని కలిగి ఉంటారని పేర్కొన్నారు సెహ్వాగ్. ఇక షమీపై దాడి చాల దిగ్భ్రాంతికరం. కోహ్లీ సేన మూకుమ్మడిగా విఫలమైతే షమీ ఒక్కడు మాత్రం జట్టుని గెలిపించలేదన్నది నెగిటీవ్ ట్రోలింగ్ చేస్తున్న వారు తెలుసుకోవాల్సిన అంశం.