సాగర్ బైపోల్ అప్డేట్: మధ్యాహ్నం 3 గంటల వరకు 69 శాతం పోలింగ్

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు 69 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు చెప్పారు.

రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ఉప ఎన్నిక జరుగుతున్న పోలింగ్ ప్రాంతాల్లో పర్యటించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు.

ఇక ఉప ఎన్నిక బరిలో ఉన్న అభ్యర్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఇబ్రహీంపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి నాగార్జున సాగర్‌లో ఓటేశారు. ఇక నల్గొండలోని చింతగూడెంలో టీడీపీ అభ్యర్థి అరుణ్ కుమార్, పల్గు తండాలో బీజేపీ అభ్యర్థి రవి కుమార్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.