తేజ్ ఈజ్ బ్యాక్.. దసరా పర్వదినాన.. మెగా అభిమానులకి అద్దిరిపోయే శుభవార్త..!

sai dharam tej discharged from hospital
sai dharam tej discharged from hospital
sai dharam tej discharged from hospital
sai dharam tej discharged from hospital

దసరా పండుగ సందర్భంగా మెగా అభిమానులకి అద్దిరిపోయే శుభవార్త వచ్చేసింది. గత నెల వినాయకచవితి రోజున.. రోడ్డుప్రమాదంలో గాయపడిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నేడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. దాదాపు 35రోజుల సుదీర్ఘ చికిత్స అనంతరం తేజ్ ని డిశ్చార్జ్ చేశారు అపోలో డాక్టర్లు. అయితే నేడే సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు కూడా కావటం మరో విశేషం. ప్రమాదం జరిగిన సందర్భంలో షాక్ కి గురైన తేజ్ కి షోల్డర్ సర్జరీ జరిగింది. అయితే ఇంకా షాక్ నుండి కోలుకొని కారణంగా ఇన్నిరోజులు ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకున్నాడు తేజ్. ఈ నేపథ్యంలో అల్లుడు కోలుకొని ఇంటికి తిరిగిరావటంతో మెగాస్టార్ చిరంజీవి స్పదించాడు. మా ఇంట్లో దసరాతో పాటు మరో పండగ కూడా చేసుకోబోతున్నాం అంటూ ట్వీట్ పెట్టాడు చిరు.

ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ కి చిరంజీవి. పుట్టిన రోజు శుభాకాంక్షురాలు తెలియజేస్తూ.. ‘ఇది నీకు పునర్జన్మ..         ఈ దసరా పండగకు పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుండి ఇంటికి చేరుకున్నావు. ఇది నిజంగా అద్భుతం సాయి ధరమ్ తేజ్ పెను ప్రమాదం నుంచి తప్పుకున్నాడు; అంటూ మెగాస్టార్ పేర్కొన్నారు. ‘సాయి ధరమ్ తేజ్ కు పెద్ద అత్త… పెద్ద మామ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు’.. అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ కూడా తేజ్ కి బర్త్ డే విషెష్ తెలిపాడు. ఇక సాయి ధరమ్ తేజ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావటంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.