మేనమామ పవన్ బాటలో అల్లుడు తేజ్.. ఫారిన్ అమ్మాయితో ప్రేమ.. పెళ్లి కూడా..!

sai dharam tej marriage with brazilian model larissa bonesi
sai dharam tej marriage with brazilian model larissa bonesi
sai dharam tej marriage with brazilian model larissa bonesi
sai dharam tej marriage with brazilian model larissa bonesi

పెళ్లి

35రోజుల సుదీర్ఘ చికిత్స అనంతరం ఎట్టకేలకు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. అయితే ప్రమాదానికి ముందు వరకు కూడా తేజ్ పై కొన్ని పుకార్లు పుట్టాయి. త్వరలోనే సాయి తేజ్ ఒక ఇంటివాడు కాబోతున్నట్టు.. రిపబ్లిక్ మూవీనే తేజ్ కి బ్యాచ్ లర్ గా ఆఖరి సినిమా అంటూ కూడా గాసిప్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు తేజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో కూడా తెలిసిపోయిందంటూ సోషల్ మీడియాలో కొన్ని ప్రెడిక్షన్స్ పుట్టుకొస్తున్నాయి. ఆమె ఎవ‌రో కాదు.. బ్రెజిలియ‌న్ హీరోయిన్ కం మోడల్ లారిస్సా బోనెసి. తిక్క సినిమాలో సాయి తేజ్ తో కలిసి నటిచింది లారిస్సా. ఆ చిత్రం నుండి వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతూవస్తుంది. ఈ మధ్య వీరి స్నేహం ప్రేమగాను మారిందని అంటున్నారు. అందుకే తేజ్ పై లారిస్సా వరుసగా రొమాంటిక్ ట్వీట్స్ పెడుతుందని నెటిజన్స్ కొన్ని ఉదాహరణలు కూడా చూపెడుతున్నారు.

సాయితేజ్ రిప‌బ్లిక్ మూవీ విడుద‌ల స‌మ‌యంలో ‘నా తేజు న‌టించిన రిప‌బ్లిక్ ఈరోజు విడుద‌లవుతుంది’ అంటూ ట్వీట్ చేస్తూ ల‌వ్ సింబ‌ల్‌ను పోస్ట్ చేసిన లారిస్సా..రీసెంట్‌గా ఐ మిస్ యు తేజ్ అంటూ ట్వీట్ చేసింది. రీసెంట్‌గా ‘ఐ యామ్ ఇన్ ల‌వ్‌’.. అంటూ మ‌రో ట్వీట్ చేసింది. దీంతో నెటిజ‌న్స్ ఆమె సాయితేజ్‌తో ప్రేమ‌లో ఉంద‌ని అంటున్నారు. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మెగా కాంపౌండ్ నుండి ఎవరైనా స్పదించాల్సిందే. అయితే ఇక్కడ ఫ్యాన్స్ మరో కంపేరిజన్ కూడా తెస్తున్నారు. సాయి తేజ్ పెళ్లి విషయంలో మేనమామ పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్నాడా అని అంటున్నారు. పవన్ మూడవ భార్య అన్నా లెజినోవా కూడా ఫారిన్ అమ్మాయి కావటంతో అల్లుడు తేజ్ కూడా ఫారిన్ గర్ల్ పై మనసు పడ్డాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టే.. సాయి తేజ్ కూడా బ్రెజిలియన్ మోడల్ ప్రేమలో ఉన్నట్టు మాత్రం గాసిప్స్ తెగ వస్తున్నాయి. ఇక సినిమాల్లో హీరోగా సక్సెస్ అయ్యి.. తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు తేజ్. కెరీర్ లోనే కాదు క్యారెక్టర్ పరంగాను తేజ్ కి ఇండస్ట్రీలో మంచి పేరుంది. అందుకే సాయి తేజ్ ఒక ఇంటివాడైతే చూడాలని మెగా అభిమానుల కోరిక. సో ఈ పుకార్లు నిజమవ్వాలనే కోరుకుంటున్నారు ఫ్యాన్స్.