ఆఫీస్ కు వచ్చాక ఫోన్ ఛార్జింగ్ పెడితే సాలరీ కట్. వైరలవుతున్న వింత రూల్

మీరు విన్నది నిజమే. ఆఫీస్ లో ఛార్జింగ్ పెడితే సాలరీ కట్ అవ్వటమేంటనీ ఆశ్చర్యపోతున్నారా? మరి రోజు ఆఫీస్ వచ్చిన ఉద్యోగులంతా ఫోన్ ఛార్జింగ్ పెడుతుంటే ఆ బాస్ కు ఎక్కడో కాలింది. ఎంత చెప్పిన ఉద్యోగులు వినకపోవటంతో ఇక ఇలా కుదరని భావించినట్లున్నాడు. ఛార్జింగ్ పెడితే షాక్ కొట్టాలంటే నిర్ణయం ప్రకటించాడు. ఎవరైతే ఆఫీస్ లో ఛార్జింగ్ పెడుతారో వాళ్ల సాలరీ కట్ అని రూల్ పాస్ చేశాడు. ఐతే ఆ బాస్ ఎవరన్నది..ఈ సంఘటన ఎక్కడ జరిగిందన్నది స్పష్టంగా తెలియటం లేదు. కానీ ఆ రూల్ ఏదైనా రాసిన ఉన్న ఓ పేపర్ నోట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ బాస్ కు ఎంత కోపం వచ్చిందో ఏమో గానీ ఘాటుగానే నోట్ పెట్టాడు. ఫోన్ ఛార్జింగ్ అలా పెట్టటం అంటే కరెంట్ దొంగతనం కిందకే వస్తుందని తేల్చిచెప్పాడు. పని చేసే చోట నైతిక విలువలు పాటించాలని ఉద్యోగులకు కనపడేలానోట్ పెట్టాడు.

వైరల్ గా మారిన నోట్

ఈ నోట్ ఎక్కడిదని స్పష్టంగా తెలియకపోయినప్పటికీ చాలా మందికి కనెక్ట్ అయ్యేలా ఉండటంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెడ్డిట్ వైబ్ సైట్ లో చాలా మంది  దీనిపై డిస్ కస్ చేస్తున్నారు. కొంతమంది ఆ బాస్ నిర్ణయం కరెక్టేనని చెబుతుంటే…మరికొంత మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఆఫీస్ లో సిస్టమ్ ఉపయోగించినట్లే ఛార్జింగ్ కోసం కరెంట్ ను ఉపయోగించటాన్ని తప్పుపట్టటం కరెక్ట్ కాదంటున్నారు. ఈ నోట్ మూడేళ్ల క్రితం నాటిదైనా ఇప్పుడు వైరల్ గా మారిందని మరికొంత మంది చెబుతున్నారు. అటు చాలా కార్పొరేట్ కంపెనీల్లో ఆఫీస్ అవర్స్ లో ఫోన్ వాడటాన్నే అనుమతించారు. అలాంటి వాళ్లు మాత్రం అసలు మాకు ఫోనే లేదు…ఇంక ఛార్జింగ్ ఎలా పెట్టేదీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.