బుల్లెట్ ఫ్రూఫ్ కారు కొన్న సినీ నటుడు స‌ల్మాన్ ఖాన్

Salman Khan

బాలీవుడ్ సినీ నటుడు స‌ల్మాన్ ఖాన్ కి గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు వ‌చ్చాయి. ఇటీవల పంజాబీ సింగర్‌ సిద్దూ మూసేవాలా మర్డర్‌ లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. మరోవైపు లారెన్స్ అతిపెద్ద క్రైం సిండికేట్‌ని నడిపిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు సల్మాన్ ని బెదిరించారని తెలుస్తోంది. దాంతో ఇటీవలే లైసెన్స్ గన్‌ తీసుకున్నారు సల్మాన్ ఖాన్. ఇప్పుడు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు కొన్నాడు.

సల్మాన్ ఖాన్ కొన్న బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు.. టయోటా ల్యాండ్‌ క్య్రూయిజ్‌ ఎస్‌యువీ. దీని గ్లాసెస్‌ చాలా మందంగా కనిపిస్తున్నాయి.దీని విలువ కోటిన్నర రూపాయలుగా తెలుస్తోంది.