చైతు పుట్టిన రోజుని వదిలేసి.. కుక్కకి విష్ చేసిన సమంత.. మరి ఇంత ద్వేషమా ?

Samantha Insults Naga Chaitanya By Doing Birthday Celebration To Her Pet Dog
Samantha Insults Naga Chaitanya By Doing Birthday Celebration To Her Pet Dog

నాగచైతన్యతో విడాకుల తరువాత సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్ అయ్యింది సమంత. మై మామ్స్ సెడ్ అనే హ్యాష్ ట్యాగ్ తో రోజుకొక కొటేషన్ ని షేర్ చేస్తూ.. ఇన్ డైరెక్ట్ గా ఎవర్నో టార్గెట్ చేసే విధంగా సమంత చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి సమంత చైతుతో విడాకుల తరువాత మేమిద్దరం ఫ్రెండ్స్ లా ఉంటామని కూడా సోషల్ మీడియా వేదికగా చెప్పింది. కానీ నిన్న నాగ చైతన్య పుట్టినరోజున మాత్రం బిన్నంగా ప్రవర్తించింది. అందరు చైతుకి సామ్ బర్త్ విషెష్ చెప్తుందేమో అనుకున్నారు. కానీ సమంత సైలెంట్ అయింది. వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టినా కూడా స్నేహితులుగా కంటిన్యూ అవుతామని చెప్పారు కాబట్టి చైతూకి సమంత విష్ అందుతుందని అంతా భావించారు. కానీ అది జరగలేదు. పైగా తదుపరి రోజే అనగా ఈ రోజు తన పెంపుడు కుక్క హష్‌కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఇన్స్‌స్టా స్టోరీస్ పోస్ట్ చేసింది సమంత. సమంత చేసిన ఈ పనిపై నెటిజన్స్ కూడా మండిపడుతున్నారు. తన మాజీ భర్తకు ఎందుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని అడుగుతూ కామెంట్స్ చేస్తున్నారు. పెంపుడు కుక్కకు అంత ప్రాధాన్యత ఇచ్చే నువ్వు స్నేహితుడని చెప్పిన నాగ చైతన్యను ఎలా మరిచావ్? అంటూ నిలదీస్తున్నారు. చైతు అంటే మరి అంత కోపమా అని ప్రశ్నిస్తున్నారు. కొందరైతే చైతుకి విషెష్ చెప్పకపోయినా పర్వాలేదు.. కానీ ఆ మరుసటి రోజే కుక్కకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి.. అక్కినేని అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించేలా చేసింది సమంత.