హాలీవుడ్ కి సమంత. బై సెక్సువల్ పాత్రలో..

నాగ చైతన్య తో విడిపోయిన తర్వాత సమంత మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉన్న ఆమె ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సమంత బోల్డ్ క్యారెక్టర్ చేసినప్పటికీ ఆమె అద్భుతమైన నటనకు బాలీవుడ్ లో విమర్శకులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ వెబ్ సిరీస్ తర్వాత సమంత కు బాలీవుడ్ లో అవకాశాలు క్యూ కట్టాయి. కానీ సామ్ అచితూచి క్యారెక్టర్స్ ను సెలెక్ట్ చేసుకుంటుంది. విభిన్నమైన పాత్రలకే ఆమె మొగ్గుచూపుతోంది. ఐతే తాజాగా సామ్ కు హాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చినట్లు సమాచారం.

హాలీవుడ్ ఎంట్రీ

ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ డైరెక్టర్ ఫిలిప్ జాన్ తెరకెక్కిస్తున్న మూవీలో సామ్ చాన్స్ కొట్టేసింది. దీనికి సంబంధించి సమంత అప్ డేట్ ఇచ్చింది. ఇండియన్ రైటర్ ఎన్‌ మురారి రాసిన ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ లవ్’ అనే నవల ఆధారంగా మూవీని తీస్తున్నారు. ఈ మూవీ హాలీవుడ్ లోనే కాదు..తమిళ్, హిందీ, ఫ్రెంచ్ లాంగ్వేజెస్ కూడా తీస్తున్నారు.

మరింత బోల్డ్ గా బై సెక్సువల్ పాత్రలో

సమంత ఈ సినిమాలో బై సెక్సువల్ క్యారెక్టర్ లో నటించనుందంట. ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ లో సమంత చేసిన పాత్ర కన్నా ఇందులో మరింత బోల్డ్ క్యారెక్టర్ అని సమాచారం. బై సెక్సువల్ అమ్మాయిగా సమంత కనిపించనుందంట. ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ లో పాత్రకే సమంత పై చాలా విమర్శలు వచ్చాయి. అలాంటి అంతకు మించి వివాదస్పదమైన క్యారెక్టర్ ను ఆమె ఎంచుకుంది. అసలు చైతుతో విబేధాలకు కారణం కూడా ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లోని రాజీ పాత్రే అనే కూడా వార్తలు షికార్లు చేశాయి. అలాంటిది ఈ సారి అంతకు మించి వివాదస్పద క్యారెక్టర్ ను ఎంచుకోవటం అందరినీ షాకింగ్ కు గురిచేస్తోంది. అటు అల్లు అర్జున్ పుష్ప మూవీలోనూ సమంత ఐటెం సాంగ్ చేస్తోంది.