సమంత నెక్ట్స్ ఐటం సాంగ్ ఈ హీరోతోనే..!

samantha

ఫ్యామిలీ మ్యాన్ 2 తో మొదలైన సమంత పాపులారిటీ ఇటీవలి సూపర్‌హిట్ మూవీ పుష్పలో ఆమె అద్భుతమైన ఐటం సాంగ్ తో రెట్టింపైంది. ఊ అంటావా.. మావ పాటతో జాతీయ స్థాయిలో సమంత రూత్ ప్రభు పేరు మార్మోగుతుంది.

విడాకులు అనంతరం కెరీర్‌లో స్పీడ్‌ పెంచారు నటి సమంత. వరుస ప్రాజెక్ట్ లు చేస్తున్నారు. ఈ క్రమంలో ‘పుష్ప’ సినిమా కోసం ‘ఊ అంటావా మావ’ అంటూ బన్నీతో కలిసి స్టెప్పులేశారు. సమంత వేసిన స్టెప్పులతో ఈ పాటకు మరింత క్రేజ్‌ వచ్చింది. రెండు వారాల్లోనే ఈ సాంగ్ వీడియో 73 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకుంది.

ఈ పాట హిట్ అవ్వడంతో తాజాగా సమంతను మరో క్రేజీ ఆఫర్‌ వరించినట్లు తెలుస్తోంది. విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘లైగర్‌’ సినిమాలో సామ్‌కు ఛాన్స్‌ వచ్చినట్లు సమాచారం. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

ఈ ఐటం సాంగ్ కోసం ఎవరైనా స్టార్‌ హీరోయిన్‌ను ఎంచుకోవాలని పూరీ జగన్నాథ్‌, ఆయన టీమ్‌ భావిస్తోందట. ఈ సమయంలో ‘ఊ అంటావా’ పాట సూపర్‌హిట్‌ కావడంతో తమ సినిమాలోనూ ఐటమ్‌ సాంగ్‌ని సమంతను తీసుకుంటే బాగుంటుందని చిత్రబృందం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే చిత్రబృందం సామ్‌తో సంప్రదింపులు చేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. మరి సామ్‌.. విజయ్‌ దేవరకొండ, పూరీ మాటలకు ఓకే చెప్పిందా? లేదా? తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.