హైదరాబాద్‌ కి చస్తే రాను.. సమంత సంచలన కామెంట్స్..!

Samantha Shocking Conditions To Directors After Divorce With Naga Chaitanya
Samantha Shocking Conditions To Directors After Divorce With Naga Chaitanya
Samantha Shocking Conditions To Directors After Divorce With Naga Chaitanya
Samantha Shocking Conditions To Directors After Divorce With Naga Chaitanya

విడాకుల అనంతరం సమంత జోరు పెంచేసింది. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా.. సినీ కెరీర్ ని మాత్రం టాప్ గేర్ లో నడిపిస్తుంది సమంత. ఇప్పటికే తెలుగులో చారిత్రక చిత్రం శాకుంతలం, విజయ్ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ సినిమాలు నటిస్తున్న సమంత.. తాజాగా ప్రతిష్టాత్మక డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్‌ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. అయితే విడాకుల అనంతరం వరుస సినిమాలకి కమిట్ అవుతున్న సామ్.. ఆ చిత్ర దర్శక నిర్మాతలకి సరికొత్త కండిషన్స్ పెడుతున్నట్టు తెలుస్తుంది. మూవీ షూటింగ్స్ అన్ని కూడా తమిళనాడు, చెన్నై పరిసరాల్లోనే పెట్టాలని చెప్తుందట సామ్. హైద్రాబాద్ లో షూటింగ్ అంటే చేయనంటే చేయనని మొహమాటం లేకుండా చెప్పేస్తుందట. ఒకవేళ హైద్రాబాద్ లో తప్పని సరి పరిస్థితుల్లో షూటింగ్ చేయాలొస్తే.. ఇండోర్ లో అయితేనే ఓకే చెప్తుందట. ఈ కండిషన్స్ కి ఒప్పుకుంటేనే అగ్రిమెంట్ చేసుకుందామని సమంత చెప్తున్నట్టు తెలుస్తుంది.

అయితే చైతుతో విడాకుల తరువాత అక్కినేని ఫ్యాన్స్ సమంతపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. డబ్బు మోజులో పడి చైతన్యని వదిలేసిందని సోషల్ మీడియాల్లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో పబ్లిక్ ప్లేస్.. అవుట్ డోర్ షూటింగ్స్ కి సమంత నో చెప్తుందని అనుమానిస్తున్నారు. అయితే ఈ ఆగ్రహావేశాలు తగ్గేవరకూ ఇంకా కొంతకాలం తను చెన్నైలోనే ఉండాలని సామ్ నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.ఇదిలా ఉంటే శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మించబోతున్న ఓ మూవీ కోసం ఆయన సమంతను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఈ మూవీకి తాను సైన్‌ చేసేందుకు పైన పేర్కొన్న కండిషన్స్‌ పెట్టిందట సమంత. అలాగే తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంలో తెరకెక్కే ఈ చిత్రం కోసం సామ్‌ ఏకంగా 3 కోట్ల రెమ్యునరేషన్ కూడా డిమాండ్‌ చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.