ముఖంపై ముసుగుతో.. విడాకుల తరువాత తొలిసారి.. అక్కినేని కాంపౌండ్ కి సమంత..!

Samantha Spotted At Annapurna Studios For First Time After Divorce
Samantha Spotted At Annapurna Studios For First Time After Divorce

నాగచైతన్యతో విడాకుల తరువాత సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్ అయ్యింది సమంత. మై మామ్స్ సెడ్ అనే హ్యాష్ ట్యాగ్ తో రోజుకొక కొటేషన్ ని షేర్ చేస్తూ.. ఇన్ డైరెక్ట్ గా ఎవర్నో టార్గెట్ చేసే విధంగా సమంత చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. వీటితో పాటు తనకి సంబదించిన మూవీ అప్డేట్స్ కూడా అన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటాయి. అయితే తాజాగా సమంత గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండ్ అవుతుంది. నాగ చైతన్యతో విడాకుల తరువాత తొలిసారి అక్కినేని కాంపౌండ్ లో సమంత అడుగుపెట్టిందని, మౌనంగా కారు దిగి షూటింగ్ కోసం వెళ్లిపోయిందని తెలుస్తుంది. విడాకుల తరువాత హైదరాబాద్ లో షూటింగ్స్ వద్దని సినీ మేకర్స్ కి సమంత చెప్పినట్టు వార్తలొచ్చాయి. ఏదైనా ఇండోర్ షూట్ తప్పనిసరి పరిస్థితుల్లో అయితే పర్వాలేదు కానీ.. హైదరాబాద్ పబ్లిక్ ప్లేస్ లో మాత్రం షూటింగ్స్ వద్దని కండిషన్ పెట్టిందట సమంత. అందుకే స్టూడియోస్ లో సమంత షూట్స్ పెట్టుకుంటున్నారు.
తాజాగా అక్కినేని వారి సామ్రాజ్యం అన్నపూర్ణ స్టూడియోస్‌కి వెళ్లిందట సమంత. అయితే పర్సనల్‌గా కాకుండా ప్రొఫెషనల్‌గానే సామ్ ఈ విజిట్ చేసిందని సమాచారం. కారులో నేరుగా అన్నపూర్ణ స్టూడియోస్‌కి చేరుకున్న సమంత.. ముఖంపై ముసుగుతో దిగి పని పూర్తి చేసుకొని వెళ్లిపోయిందట. అయితే గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న చారిత్రాత్మక చిత్రం శాకుంతలం మూవీ షూటింగ్ లో భాగంగానే సామ్ అన్నపూర్ణ స్టూడియోకి విడాకుల తరువాత తొలిసారి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమా డబ్బింగ్ పనుల కోసం సమంత అన్నపూర్ణ స్టూడియోస్‌ కి రాగ ఇప్పుడు ఈ ఇష్యు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ఇన్నేళ్లు అక్కినేని వారసుడి భార్యగా, అక్కినేని కోడలిగా, ఒక అధినేతగా అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్స్ కి వెళ్లిన సమంత తొలిసారి మాములు నటిగా రావటం చర్చనీయాంశం అవుతుంది.