గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ‘సమ్మతమే’ చిత్ర బృందం

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో సమ్మతమే చిత్రబృందం భాగమైంది. జూబ్లీహిల్స్ లోని జీహెచ్ఎంసీ పార్క్ లో చిత్ర బృందం మొక్కలు నాటింది.  నటీనటులు కిరణ్, చాందిని, నిర్మాత ప్రవీణ మొక్కలు నాటారు.  ఈ సందర్భంగా చిత్ర హీరో కిరణ్, హీరోయిన్ చాందిని మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు.ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే అవకాశం కలిగినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి నిర్మాత ప్రవీణ కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం చిత్ర బృందానికి గ్రీన్ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు.