దళితుల నోటి కాడి కూడు తీసేసేలా బీజేపీ కుట్రలు: సండ్ర వెంకట వీరయ్య

Sandra Venkata Viraiah fire on bjp party

Sandra Venkata Viraiah fire on bjp party

బీజేపీ అబద్ధపు పునాదులపై హుజురాబాద్ లో గెలవాలని చూస్తోందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శించాడు. కరీంనగర్ జిల్లా వీణవంకలో దళితులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత బంధు ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేత ప్రేమేంధర్ రెడ్డి లేఖ రాశారన్నారు.

దళితుల నోటి కాడి కూడు తీసేసేలా బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. బీజేపీ నాయకులను దళిత కాలనీలకు రాకుండా వెలివేయాలి. దళితులను ఊచకోత కొస్తున్న పార్టీ బీజేపీ. నేనే రాజీనామా చేయడం వల్లే దళిత బంధు వచ్చిందంటున్న ఈటెల.. తనకు తెలియకుండా ఆ పార్టీ లేఖ ఎలా రాసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

బీజేపీకి ఆదానీ, అంబానీలు తప్ప దళితులు కనిపించడం లేదా? సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నెరవేర్చే వ్యక్తి.. దళిత బంధు పథకం ఆగదు. బీజేపీ నేతల వైఖరిని దళిత జాతి వ్యతిరేకించాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరుపేదల కోసం పనిచేయడంలేదన్నారు.

అబద్ధాలే ఎజెండాగా హుజురాబాద్ ఎన్నికల్లో పనిచేస్తున్నారు. లేఖ రాసినట్టు నిరూపిస్తే నేలకు ముక్కు రాస్తా అని ఈటెల అన్నాడు.. ఈసీకి లేఖ రాసింది నిజం కాదా. దళిత బంధు కొత్త పథకం ఎలా అవుతుందో సీఈసీ చెప్పాలి. మోసాలు ఎజెండాగా పనిచేస్తున్న పార్టీ బీజేపీ అని మండిపడ్డారు.