జయసుధకు ఏమైంది.. ఎందుకిలా మారిపోయింది..!

senior actress jayasudha new look going viral in social media
senior actress jayasudha new look going viral in social media

తెలుగులో సహజ నటి అంటేనే జయసుధ. పద్నాగేళ్ల వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ప్రేక్షకులని ఉర్రుతలూగించింది. చేసే పాత్ర ఏదైనా మెలో డ్రామాకి దూరంగా న్యాచురల్ గా పర్ఫార్మ్ చేస్తుంది జయసుధ. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి సీనియర్ హీరోలతో హీరోయిన్ గా నటించిన జయసుధ ఇప్పటి కుర్ర హీరోలకి తల్లిగా.. అక్కగా.. బామ్మగా నటిస్తూ.. ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రవేస్తుంది. బొమ్మరిల్లు, ఎవడు, గోవిందుడు అందరివాడేలే, రౌడీ వంటి చిత్రాలు సెకండ్ ఇన్నింగ్స్ లో జయసుధ కి మంచి పేరు తీసుకొచ్చాయి. అయితే కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన జయసుధ ఈ మధ్య సినిమాల్లో ఎక్కువగా కనిపించటం లేదు. మొన్న జరిగిన మా ఎన్నికల్లో కూడా జయసుధ అధ్యక్ష స్థానానికి పోటీచేస్తారేమో అనుకున్నారు. కానీ ఆమె కనీసం ఓటు వేయడానికి కూడా రాలేదు. దీంతో జయసుధ ఆరోగ్య సమస్యలపై అనుమానాలు వచ్చాయి.

అయితే అనారోగ్య సమస్యలతోనే జయసుధ సినిమాలకి దూరమైందని.. అమెరికాలో ట్రీట్మెంట్ కోసం కూడా వెళ్లిందని పుకార్లు వచ్చాయి. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ తాజాగా జయసుధ షేర్ చేసిన ఫొటోలో మాత్రం భారీ మార్పులు కనిపించాయి. ఎప్పుడు నిండు మొహంతో కళకళ లాడే జయసుధ చాలా వీక్ గా కనిపిస్తున్నారు. కాస్త లావుగా ఉండే జయసుధ బరువు తగ్గి బలహీనంగా కనిపిస్తున్నారు. జయసుధ తన ట్విటర్‌లో ఫొటో షేర్‌ చేస్తూ.. ‘స్మైల్.. ఇట్స్ ఫ్రీ థెరపీ’ అంటూ ట్వీట్‌ చేసింది. దీంతో ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమెను చూసి షాకవుతున్నారు. జయసుధ ఏంటీ ఇలా మారిపోయారు, ముఖంలో మునుపటి కళ లేదు. సహజనటికి నిజంగా ఆనారోగ్య సమస్యలు తలెత్తినంటున్నాయంటూ అంటూ ఆమె ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు నెటిజన్లు. అయితే ఆమెకు ఏమైంది, విదేశాలకు ఎందుకు వెళ్లారనేది స్వయంగా ఆమె స్పందించే వరకు వేచి చూస్తేనే బెటర్.