బెంగళూరులో ఒరుగుతున్న ఏడంతస్తుల పోలీస్‌ క్వార్టర్‌ బిల్డింగ్

బెంగళూరులో ఇటీవల వరుసగా భవనాలు ఒరిగి కూలిపోతున్న సంఘ‌ట‌న‌లు వ‌రుస‌గా జ‌రుగుతున్నాయి. కొత్తగా నిర్మించిన పోలీస్‌ క్వార్టర్‌ బిల్డింగ్ కూడా ఒరుగుతున్న బిల్డింగ్ ల స‌ర‌స‌న చేరింది. మగధి రోడ్డులోని మూడేండ్ల కిందట ఏడంతస్తుల బిల్డింగ్‌ నిర్మాణం పూర్తి కాగా.. గత ఏడాది పోలీస్‌ సిబ్బంది కుటుంబాలకు అందులోని క్వార్టర్స్‌ను కేటాయించారు.

ఇటీవ‌ల పెద్ద పగుళ్ల రావ‌డంతో శనివారం బీ బ్లాక్‌ బిల్డింగ్‌ 1.5 అడుగుల మేర ఒరిగింది. దీంతో అందులో నివాసం ఉంటున్న 38 కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు. ఇది ఒరుగుతూ బీ బ్లాక్‌, సీ బ్లాక్‌ బిల్డింగ్‌పై పడుతుండటంతో.. వాటికి కూడా ప్రమాదం పొంచి ఉంది. ఈ నేప‌థ్యంలో అధికారులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా సీ బ్లాక్‌లోని కుటుంబాల‌ను కూడా ఖాళీ చేయిస్తున్నారు. నాణ్యత లేని నిర్మాణం వల్లనే కట్టిన మూడేండ్లకే పోలీస్ బిల్డింగ్ ఒరుగుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు విన్పిస్తున్నాయి.