క్రికెట్ నుండి షారుఖ్ ఖాన్ బహిష్కరణ.. తెరపైకి పాత గొడవలు.. బాలీవుడ్ లో అసలేం జరుగుతుంది..!

Shah Rukh Khan Banned From Mumbai Stadium Old News Going Viral Now
Shah Rukh Khan Banned From Mumbai Stadium Old News Going Viral Now
Shah Rukh Khan Banned From Mumbai Stadium Old News Going Viral Now
Shah Rukh Khan Banned From Mumbai Stadium Old News Going Viral Now

కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ ఇష్యులో అరెస్ట్ అయ్యే వరకు షారుఖ్ ఖాన్ లైఫ్ లో పెద్ద కాంట్రవర్సీలు లేవు. సీరియల్ నటుడి స్థాయి నుండి బాలీవుడ్ బాద్షా వరకు ఎదిగిన షారుఖ్ నట జీవితం అద్భుతమని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకుండా నంబర్ వన్ స్థానానికి ఎదిగాడు. బాలీవుడ్ ని ఏలుతున్న షారుక్, సల్మాన్, అమీర్ ల ఖాన్ త్రయంలో.. సొంత కష్టంతో ఎవ్వరి సపోర్ట్ లేకుండా సూపర్ స్టార్ స్టార్ గా అవతిరించాడని బాద్షాకి మంచి పేరుంది. కానీ కొడుకు అరెస్ట్ తో ఆ మంచి పేరుని తొలగించాలని.. కావాలనే కొందరు పొలిటీషియన్స్ షారుఖ్ ని టార్గెట్ చేశారని మీడియాలో కథనాలు చూసాం. షారుఖ్ ఖాన్ లా తన కొడుకు బాలీవుడ్ ని శాశించొద్దని దుర్బుద్దితోనే కొందరు ఆర్యన్ ఖాన్ ని డ్రగ్స్ కేసులో ఇబ్బందిపెట్టారని రూమర్స్ ఉన్నాయి. అది ఎంతవరకు నిజమో కానీ.. కొడుకు మ్యాటర్ ఒక్కటి తప్ప షారుఖ్ లైఫ్ లో మరెటువంటి మచ్చ లేదు. అయితే ఒకే ఒకసారి షారుఖ్ ఖాన్ ని క్రికెట్ నుండి బహిష్కరించిన ఉదంతం చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆ అంశాన్నే మళ్ళీ తాజాగా తెరపైకి తెస్తున్నారు షారుక్ అపోజిట్ బ్యాచ్.

ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఒకసారి మందు కొట్టి రచ్చ చేశాడని ఆరోపణలతో ముంబై వాంఖడే స్టేడియం నుండి షారుఖ్ ఖాన్ ని బహిష్కరించారు. పబ్లిక్ గా మద్యం సేవిస్తూ.. గ్రౌండ్ సిబ్బందితో గొడవకి దిగాడు షారుఖ్. దీంతో స్టేడియం లోకి రానివ్వకుండా వాంఖడే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవటంతో.. వారితో చిన్నపాటి వాగ్వివాదానికి దిగాడు షారుఖ్. ఈ మ్యాటర్ ఇష్యు కావటంతో ముంబై క్రికెట్ అసోసియేషన్ సీరియస్ అయ్యింది. పబ్లిక్ గా మందు కొడుతూ.. సిగరెట్ కాలుస్తూ.. స్టేడియం సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించాడని షారుఖ్ ని కొన్ని రోజులు స్టేడియంకి రానివ్వకుండా బ్యాన్ చేసింది. ఇక అప్పటి నుండి ఇప్పటివరకు ఎంతో జాగ్రత్తగా ఉంటూ.. ఎలాంటి కాంట్రవర్సీలకు వెళ్లకుండా.. తనపనేదో తానూ చేసుకుంటూ ఉన్నాడు కింగ్ ఖాన్. అలాంటి షారుఖ్ పై ఇప్పుడు విమర్శలు వచ్చేలా సంఘటనలు చోటుచేకున్నాయి.

కొడుకుని సరిగ్గా పెంచలేదని.. తండ్రి ఎలాగైతే పబ్లిక్ గా మద్యం సేవిస్తూ మత్తులో ఉంటాడో..కొడుకు కూడా అలానే తయ్యారయ్యాడని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా షారుఖ్ ని పదే పదే టార్గెట్ చేస్తున్నారు. తాజాగా కొడుకు ఆర్యన్ ఖాన్ కి బెయిల్ మంజూరవ్వటం.. ఆర్యన్ కేసులో అంత బలం లేదని.. డ్రగ్స్ తీసుకున్నట్టు.. అమ్మినట్టు సరైన సాక్షాలు ఇప్పటివరకు దొరకలేదని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో షారుఖ్ పై కొంచం సింపతీ వస్తుంది. బాలీవుడ్ తారలు కూడా బహిరంగంగానే షారుఖ్ కి మద్దత్తు తెలుపుతున్నారు. నటులపై రాజకీయ దాడులు ఆపాలని షారుఖ్ పై పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని బీ టౌన్ మీడియా సంస్థలు షారుక్ అప్పట్లో ముంబై వాంఖేడే లో గొడవపడి.. బ్యాన్ అయినా వార్తలని తాజాగా వైరల్ చేస్తూ.. షారుఖ్ ఇమేజ్ డ్యామేజ్ చేసే పనిలో పడ్డాయి. దాంతో అప్పటి ఈ షారుఖ్ బ్యాన్ వార్త ప్రస్తుతం బీ టౌన్ లో చర్చనీయాంశం అవుతుంది.