బాలీవుడ్ లో సంచలనం.. డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కొడుకు అరెస్ట్..!

Shah Rukh Khan Son Arrested In Drugs Case
Shah Rukh Khan Son Arrested In Drugs Case
Shah Rukh Khan Son Arrested In Drugs Case
Shah Rukh Khan Son Arrested In Drugs Case

బాలీవుడ్ అంటే డ్రగ్స్ .. డ్రగ్స్ అంటే బాలీవుడ్. చిన్న పెద్ద.. ఆడ మొగ తేడాలేవి లేకుండా నిత్యం మత్తులో తూలటం బీ టౌన్ సెలబ్రెటీలకు హాబీ. ముంబై పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న బాలీవుడ్ బడా బాబుల డ్రగ్స్ కల్చర్ ని నిలువరించలేకపోతుంది. ఇప్పటికే ఈ కేసుల్లో సల్మాన్, షారుఖ్, దీపికా, అలియా వంటి స్టార్ హీరో హీరోయిన్స్ కేసులకు అటెండ్ అవుతూ.. విచారణలు ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా ఈ డ్రగ్స్ మహమ్మారి మరో తరాన్ని కూడా హరించేలా ఉంది. బాలీవుడ్ స్టార్స్ వారసులు.. టీనేజిలోనే డ్రగ్స్ కి బానిసవుతున్నారు.

తాజాగా డ్రగ్స్ తీసుకుంటూ పార్టీ చేసుకుంటున్న షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ ని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న వార్త బాలీవుడ్ లో సంచలనమవుతుంది. ముంబై శివారులో జరిగిన ఓ రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నారని సంచారంతో రైడ్ చేసిన పోలీసులు పలువురు యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో షారుఖ్ కొడుకు కూడా ఉన్నాడని బీ టౌన్ లో వార్తలొస్తున్నాయి. ఈ పార్టీలో అధిక మొత్తంలో డ్రగ్స్ వాడుతున్నారని గుర్తించిన ఎన్సీబీ.. పెద్ద మొత్తంలో కొకైన్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

సముద్రం మధ్యలో క్రూజ్‌ షిప్‌లో ఏర్పాటు చేసిన రేవ్‌ పార్టీలో మాదకద్రవ్యాలు వాడుతూ పార్టీ చేసుకుంటున్నారని సమాచారం అందడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాడులు చేయగా ఈ పార్టీలో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ సహా ఇంకొంతమంది సెలబ్రిటీ కిడ్స్ కూడా ఉన్నారట. అయితే శనివారం అర్ధరాత్రి అరెస్ట్ అయినా ఈ యువకులని ఆదివారం ఉదయం ముంబైకి తీసుకొచ్చారు. దీంతో మరోసారి బాలీవుడ్ డ్రగ్స్ కలకలం షురూ అయింది. షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ కూడా డ్రగ్స్ తీసుకున్నాడా అని విచారణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆర్యన్ వాట్సాప్ మెసేజెస్.. డ్రగ్స్ పెడ్లర్స్ తో సంబంధాలు లాంటి అంశాలను లోతుగా పరిశీలిస్తోంది ఎన్సీబీ. అయితే బాలీవుడ్ లో తండ్రుల వలె వారి వారసులు కూడా డ్రగ్స్ కి బానిసవుతుండటం విచారకరం. ఇంకా కెరీర్ స్టార్ అవ్వకుండానే.. ఇలా మత్తు కల్చర్ కి ఈ టీనేజ్ స్టార్స్ అలవాటుపడటం అత్యంత బాధాకరం.