ఆర్యన్ ఖాన్ బెయిల్‌లో కీలక పాత్ర పోషించిన షారుక్ ఖాన్ సహనటి జూహీ చావ్లా

Juhi-Chawla-a-key-role-in-Aryans bail

Juhi-Chawla-plays-a-key-roll in aryans bail

షారుఖ్ ఖాన్ తో కలిసి అనేక సినిమాల్లో నటించిన జూహీ చావ్లా.. ఇవాళ తన కుమారుడు ఆర్యన్ ఖాన్ ను జైలు నుండి విడుదల అవ్వడంలోనూ కీలక పాత్ర పోషించారు. జూహీ చావ్లా ఆర్యన్ ఖాన్‌కు రూ.1 లక్షకు పూచీకత్తు ఇవ్వడానికి ముందుకువచ్చారు. ఆర్యన్ బెయిల్ బాండ్‌పై సంతకం చేయడానికి ముంబై సెషన్స్ కోర్టుకు ఆమె వెళ్లారు. ఆర్యన్ ఖాన్ డబ్బు చెల్లించడంలో ఒకవేల విఫలమైతే ఆమె చట్టపరంగా బాధ్యత వహించి పూచీకత్తు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

అక్టోబరు 2న క్రూయిజ్ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న ఆర్యన్ ఖాన్ ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) దాడి చేసి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఆర్యన్ ఖాన్ 22 రోజులపాటు ఉన్నారు. అతడు బెయిల్ పై విడుల కావడానికి బెయిల్ పేపర్లు సకాలంలో సమర్పించాల్సి ఉంటుంది.  క్రూయిజ్ డ్రగ్స్ కేసులో మొత్తం 20 మందిపై  NCB  కేసు నమోదు చేసింది.

Juhi-Chawla-a-key-role-in-Aryans bail

మాజీ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ముకుల్ రోహత్గీతో కూడిన న్యాయవాద బృందం ఆర్యన్ ఖాన్ తరఫున ముంబై హైకోర్టులో వాదించిన విషయం తెలిసిందే. క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఉద్దేశపూర్వకంగానే ఆర్యన్ ను ఇరికించారని, ఆర్యన్ దగ్గర డ్రగ్స్ కూడా దొరకలేదని, కేవలం వాట్సాప్ చాట్ ల ఆధారంగానే ఆర్యన్ ను అనుమానిస్తున్నారని వారు కోర్టులో వాదించారు. వీరి వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ఆర్యన్ కు బెయిల్ మంజూరు చేసింది.