దారుణం.. జైల్లో మలమూత్ర విసర్జన లేక.. క్షిణించిన షారుఖ్ ఖాన్ కొడుకు ఆరోగ్యం..!

shahrukh khan son aryan khan health in trouble
shahrukh khan son aryan khan health in trouble
shahrukh khan son aryan khan health in trouble
shahrukh khan son aryan khan health in trouble

ముంబయిలోని క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో ఇటీవల అరెస్టయిన బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ ఆరోగ్య పరిస్థితి బాలేనట్టు వార్తలొస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా ఇప్పటికే కోర్టులో రెండు సార్లు బెయిల్ నిరాకరణ అయ్యింది. దీంతో కావాలనే తెరవెనుక కొన్ని రాజకీయశక్తులు షారుఖ్ కొడుకుని టార్గెట్ చేస్తున్నాయని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. దీంతో తమ కొడుకుని కావాలనే జైల్లో బందించారని ఇప్పటికే గౌరీఖాన్ శోకసంద్రంలో ఉండగా.. షారుక్ ఖాన్ అయితే భోజనం కూడా మానేసి బాధపడుతున్నట్టు ముంబై మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇక ఈ నెల 20న మూడవసారి బెయిల్ అప్లై చేయబోతున్నారు షారుఖ్. ఈ సారి ఆర్యన్ బయటికొచ్చే అవకాశాలున్నాయని తెలిసి.. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా తేరుకుంటున్నషారుఖ్, గౌరి దంపతులకి.. తమ కొడుకు తాజా ఆరోగ్య పరిస్థితి ఆందోళన రేకెత్తిస్తుంది.

తాజాగా జైల్లో ఉన్న ఆర్యన్ ఆరోగ్యం ప్రస్తుతం క్షిణిస్తున్నట్టు తెలుస్తుంది. బీ టౌన్ కథనాల ప్రకారం.. జైల్లో శిక్ష అనుభవిస్తున్నప్పటి నుండి ఆర్యన్ భోజనం చేయటం లేదట. జైలు క్యాంటిన్‌లో కొనుకున్న పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్లతోనే ఆకలి తీర్చుకుంటున్నాడట. ఇంటి నుంచి తీసుకొచ్చిన వాటిర్ బాటిల్స్‌లోని నీటినే పొదుపుగా వాడుకుంటూ తాగుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆర్యన్ చాల నిరసించి పోయాడట. ఆర్యన్ ఆరోగ్య పరిస్థితి పై అక్కడి జైలు అధికారులు సైతం ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఒక అధికారి అనధికారంగా మాట్లాడుతూ..                     ‘అసలే 5ఏళ్ళ నుండి మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డ శరీరం. ఒక్కరోజు అవి తీసుకోకపోతానే బాడీలో ఎన్నో మార్పులు వస్తాయి. అవి తట్టుకోవటం కష్టం. అలాంటిది జైల్ కి వచ్చినప్పటి నుండి ఆర్యన్ కనీసం భోజనం కూడా చెయ్యట్లేదు మలమూత్ర విసర్జనని తగ్గించుకోవడానికే అలా చేస్తున్నట్టు నాకనిపిస్తుంది. అందుకే కొద్దిపాటి నీళ్లని మాత్రమే ఆర్యన్ తీసుకుంటున్నాడని ఆ అధికారి చెప్పారు. ఇక ఈ అధికారి వీడియో బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుండటంతో షారుఖ్ ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చెందుతుంది.