రేతిబౌలి నుండి గచ్చిబౌలి వరకు ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు నిర్మిస్తున్న రెండు 6 లేన్ల ఫ్లైఓవర్లు వయా షేక్ పేట్, ఫిలింనగర్ జంక్షన్, ఓయు కాలనీ జంక్షన్, విస్పర్ వ్యాలీ జంక్షన్ వరకు నిర్మించే షేక్ పేట్ ఫ్లైఓవర్ ఇంటర్మీడియట్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే పనులన్నీ పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధం కానుంది. హైటెక్ సిటీ వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రజలకు ఈ మధ్యంతర రింగ్ రోడ్ నిర్మాణం వలన ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కానున్నాయి.

రూ. 333.55 కోట్ల అంచనా వ్యయంతో 2.8 కిలోమీటర్ల మేర కడుతున్న ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. 74 పిల్లర్లతో ఈ ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 72 పియర్ క్యాప్స్ పూర్తయ్యాయి. 440 పీఎస్సీ గ్రీడర్స్, 144 కాంపోసిట్ గ్రీడర్స్, 73 స్లాబ్ ల నిర్మాణం కూడా పూర్తయింది. ఇప్పటి వరకు 93 శాతం నిర్మాణ పనులు పూర్తికాగా డిసెంబర్ నాటికి ఈ ఫ్లై ఓవర్ ను ప్రజలకు అందుబాటులోకి తెనున్నారు.