ర‌జ‌నీకాంత్‌తో శ‌శిక‌ళ‌ భేటీ.. త‌మిళ రాజ‌కీయాల్లో కొత్త చర్చ

Shashikala meets Rajinikanth

అన్నాడీఎంకే బ‌హిష్కృత నాయ‌కురాలు శ‌శిక‌ళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌తో భేటీ అయ్యారు. చెన్నైలోని ర‌జ‌నీకాంత్ నివాసానికి వెళ్లి, శ‌శిక‌ళ భేటీ అయ్యారు. ఈ స‌మ‌యంలో ర‌జ‌నీకాంత్ భార్య ల‌త‌ కూడా ఉన్నారు.

దీంతో సోషల్ మీడియాలో త‌మిళ రాజ‌కీయాలపై ఆస‌క్తిక‌ర చర్చ సాగుతోంది. అయితే ఇటీవల అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన‌ దాదాసాహెబ్ ఫాల్కె అవార్డును అందుకున్న సంద‌ర్భంగా ర‌జ‌నీకాంత్‌కు శశిక‌ళ‌ శుభాకాంక్ష‌లు తెలిపేందుకే వెళ్లనట్లు శశికళ వర్గం చెబుతుంది.

అన్నాడీఎంకేలో ఇటీవలే ప‌దవుల పంపకం పూర్తి అయింది.  పార్టీ స‌మ‌న్వ‌య క‌ర్త‌గా పన్నీర్ సెల్వం బాధ్య‌త‌లు చేప‌డితే, ఉప స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ప‌ళ‌ని స్వామి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. పార్టీని త‌న చెప్పుచేత‌ల్లోకి తీసుకోవాల‌ని శ‌శిక‌ళ భావిస్తున్న వేళ‌, వీరిద్ద‌రూ ఓ అవ‌గాహ‌న‌కు రావ‌డం తమిళనాట ఆసక్తిగా మారింది.