శిల్పాశెట్టి సంచలన నిర్ణయం.. భర్త రాజ్ కుంద్రాతో విడాకులు ?

Shilpa Shetty Is Planning A Separate Life From Raj Kundra, Is Divorce On Cards?
Shilpa Shetty Is Planning A Separate Life From Raj Kundra, Is Divorce On Cards?
Shilpa Shetty Is Planning A Separate Life From Raj Kundra, Is Divorce On Cards?
Shilpa Shetty Is Planning A Separate Life From Raj Kundra, Is Divorce On Cards?

స్టార్ హీరోయిన్ గా శిల్పాశెట్టికి బాలీవుడ్ లో ఉండే క్రేజ్ మాములుగా ఉండదు. ఆ క్రేజే శిల్పాశెట్టిని బుల్లితెరలోను మరింత ఫెమస్ చేసింది. టీవీ రియాలిటీ షోస్ లో జడ్జిగా ఉన్నత స్థానంలో కూర్చోపెట్టారు నిర్వహకులు. ఇక ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ తోను బీ టౌన్ సోషల్ మీడియాలో శిల్పాశెట్టికి మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఇలా ఒకవైపు సినిమాలు, మరోవైపు టీవీషోస్, ఇంకోవైపు సోషల్ మీడియా అన్ని మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో శిల్పాశెట్టికి గౌరవం ఉంటుంది. కానీ తన భర్త చేసిన ఒక్క తప్పుతో అంత పోయింది. ఇప్పటివరకు కష్టపడి తెచ్చుకున్న మంచిపేరంతా గంగలో కలిసిపోయింది. మహిళగా.. ఒంటరిగా.. బ్యాక్ సపోర్ట్ లేకుండా సొంత కష్టంతో తెచ్చుకున్నపేరు ప్రఖ్యాతలు ఇప్పుడు భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ ఇష్యుతో మొత్తం స్మాష్ అయిపోయింది. తనని మోసం చేస్తూ భర్త చేసిన తప్పులకి శిల్పాశెట్టి ఎంత మానసిక క్షోభను అనుభవించిందో అందరికీ తెలిసిందే. దాంతో ఇప్పుడు శిల్పా శెట్టికి సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతున్నాయి.

శిల్పా శెట్టి తన భర్త రాజ్‌కుంద్రాకు విడాకులు ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాజ్‌కుంద్రాతో విడిపోయి తన పిల్లలతో కలిసి జీవించాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. భర్త రాజ్ కుంద్రా బెయిల్ పై మొన్న విడుదలై ఇంటికి వచ్చినా.. భర్తతో శిల్పాశెట్టి కలిసి ఉండటం లేదట. భర్త నుంచి దూరంగా ఉండాలనే శిల్పా శెట్టి నిర్ణయించుకున్నట్టు బీ టౌన్ చెవులు కొరుకుతోంది. రాజ్ కుంద్రా అరెస్ట్ వల్ల మొహం బయటకు చూపించలేని శిల్పా శెట్టి తన టీవీ షోస్ లో కూడా ఉన్నతమైన జడ్జి స్థానంలో కూర్చొని జడ్జిమెంట్ ఇవ్వలేని పరిస్థితి. అయితే మళ్ళీ బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న శిల్పాశెట్టి లేటెస్ట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా అది పలు చర్చలకు దారితీస్తుంది.

‘తప్పులు అందరు చేస్తారు. కానీ అవి ఇతరులని తీవ్ర స్థాయిలో బాధించేలా ఉండకూడదు’.. అని పోస్ట్ పెట్టింది శిల్పా. అయితే మరో పోస్టులో ‘ఇతరులు చేసే బయంకర తప్పులను మనం క్షమించొద్దు. అలా చేస్తే వారికి అవి అలవాటు అయిపోతాయి. నేను కూడా కొన్ని తప్పులు చేశాను. త్వరలో సరిదిద్దుకుంటాను ‘ అంటూ మరో సంచలన పోస్టు పెట్టింది శిల్పా. దీంతో బీ టౌన్ లో ఈ పోస్టులు హాట్ టాపిక్ అవుతున్నాయి. భర్తతో విడిపోడానికే శిల్పా ఇలాంటి పోస్టులు పెడుతుంది అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి వీటిలో ఎంత నిజమున్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.