తల్లీకూతుళ్ల ఘరానా మోసం.. శిల్పా శెట్టి ఆమె తల్లిపై పోలీస్ కేసు.. వెలుగులోకి కోట్ల రూపాయల తాజా దందా.. !

Shilpa Shetty, mother Sunanda Shetty, booked for fraud in Lucknow
Shilpa Shetty, mother Sunanda Shetty, booked for fraud in Lucknow
Shilpa Shetty, mother Sunanda Shetty, booked for fraud in Lucknow
Shilpa Shetty, mother Sunanda Shetty, booked for fraud in Lucknow

శిల్పాశెట్టికి వరుస కష్టాలు. తన లైఫ్ లోనే అత్యంత బ్యాడ్ టైం. భర్త పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అవ్వటం.. తనపై కూడా ఆరోపణలు రావటం.. ఎన్నో సంవత్సరల కృషితో వచ్చిన పరువు ప్రతిష్టలు మంటకలిసిపోవటం.. అన్నింటికీ మించి స్టార్ సెలబ్రెటీ కపుల్ హోదాలో ఉండే తన బ్రాండ్ వాల్యూ జీరో అవ్వటం.. ఇలా పీకల్లోతు కష్టాలో ఉన్న శిల్పాశెట్టికి మరో భంగపాటు. తాజాగా శిల్పాశెట్టి ఆమె తల్లి సునంద శెట్టిలపై లక్నోలోని పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. శిల్పా శెట్టి ఆమె తల్లి తమ వద్ద కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశారంటూ జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరూ హజరత్ గంజ్ విభూతి ఖండ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు తల్లీకూతుళ్లపై కేసు కూడా నమోదు చేసి విచారణని ప్రారంభించారు.

అయితే ఈ కేసు విచారణలో లక్నో డిజిపి సంజీవ్ సుమన్ ఛార్జ్ తీసుకుని.. రెండు బృందాలుగా పోలీసుల టీమ్ ఏర్పాటుచేసి మరి విచారణ కొనసాగిస్తున్నాడు. శిల్పాని విచారించేందుకు ఒక బృందం.. ఆమె తల్లి సునందని విచారించేందుకు మరో బృందం ఏర్పాటుచేసి ముంబైకి రెండు టీమ్స్ ని పంపినట్టు తెలుస్తుంది. ఇక పోలీసుల సమాచారం మేరకు.. ముంబైలో అయోసిస్ వెల్ నెస్ అండ్ స్పా పేరుతో శిల్పాశెట్టి ఒక ఫిట్ నెస్ సెంటర్ ని నడిపిస్తున్నట్టు తెలిసిందే.దీనికి శిల్పాశెట్టి ఛైర్మెన్ కాగా.. ఆమె తల్లి సునంద డైరెక్టర్లుగా ఉన్నారు.

ముంబైలో సెలబ్రెటీ కాస్లీ ఫిట్నెస్ సెంటర్ గా మంచి పేరు రాగ.. బిజినెస్ ఎక్స్ పాండ్ కోసం లక్నోలో కూడా ఫ్రాంచైస్ ఇవ్వాలని అనుకున్నారట తల్లీకూతుళ్లు. ఈ క్రమంలోనే లక్నోలో మరో బ్రాంచ్ ను ప్రారంభించేందుకు జోత్స్య చౌహార్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరితో కోట్ల రూపాయల డీల్ సెట్ చేసుకుని.. డబ్బులు తీసుకున్నారట. అయితే డబ్బులు తీసుకున్న తరువాత కూడా ఫిట్నెస్ సెంటర్ ని ప్రారంభించకుండా కాలయాపన చేస్తూ.. కోట్ల రూపాయలు ఇచ్చినవారికి స్పందించకుండా తప్పించుకు తిరుగుతున్నారని పోలీసులకి ఫిర్యాదు చేసారు జోత్స్య చౌహార్, రోహిత్ వీర్ సింగ్ లు. దీంతో శిల్పా, ఆమె తల్లి కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసినట్టు పోలీసులు కేస్ బుక్ చేసి విచారణ జరుపుతున్నారు.