పోర్న్ కేసు: ఎట్టకేలకు మౌనం వీడిన శిల్పా శెట్టి.. భర్తపై ఘాటు వ్యాఖ్యలు..!

Shilpa Shetty on Raj Kundra case: Please respect our privacy, we don't deserve media trial
Shilpa Shetty on Raj Kundra case: Please respect our privacy, we don't deserve media trial
Shilpa Shetty on Raj Kundra case: Please respect our privacy, we don't deserve media trial
Shilpa Shetty on Raj Kundra case: Please respect our privacy, we don’t deserve media trial

శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నో గ్రఫీ కేసు యావత్ దేశాన్ని ఒక కుదుపు కుదిపేసింది. అప్పటివరకు సెలబ్రెటీ కపుల్స్ గా స్టార్ స్టేటస్ అనుభవించిన ఈ జంటపై రాజ్ కుంద్రా అరెస్ట్ నుండి మీడియాల్లో వరుస కథనాలు. నీలిచిత్రాలు, అడల్ట్ కంటెంట్, గోల్డ్ స్కామ్ ఇలా రాజ్ కుంద్రా కి సంబదించిన చీకటి సామ్రాజ్యాలన్నీ ఒక్కొక్కటిగా బయటికొచ్చాయి. ఈ నేపథ్యంలో శిల్పాశెట్టిపై కూడా తీవ్ర విమర్శలొచ్చాయి. భార్యకి తెలీకుండా రాజ్ కుంద్రా బిజినెస్ ఎలా చేస్తాడని ఎన్నో డౌట్స్ వచ్చాయి. దీంతో తన నివాసంలోనే శిల్పాశెట్టిని కూడా విచారించింది ముంబై క్రైమ్ బ్రాంచ్. ఆ సందర్భలో తనపై ఎన్నో ఆరోప‌ణ‌లు, వ‌దంతులు వ్యాప్తి చేస్తున్నార‌ని కోర్టులో కేసు కూడా వేసింది. కోర్టు కూడా శిల్పాశెట్టిపై నిరాధార కథనాలని ప్రచురించొద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భాన శిల్పాశెట్టి రియాక్ట్ అయింది. ఎట్టకేలకు మౌనం వీడి భర్త కేసుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోర్టు పరిధిలోని అంశాన్ని నేను పెద్దగా రియాక్ట్ అవ్వను అంటూనే రియాక్ట్ అయింది శిల్పా.

ఈ వివాదంలోకి త‌న‌ను లాగుతూ త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని ఇన్‌స్టాగ్రాం పోస్ట్‌లో శిల్పా శెట్టి కోరారు. పోర్న్ రాకెట్ కేసు విచార‌ణ‌లో ఉంద‌ని, ముంబై పోలీసులతో పాటు న్యాయ‌వ్య‌వ‌స్ధ ప‌ట్ల త‌న‌కు పూర్తి విశ్వాసం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. మా కుటుంబం అంత న్యాయపరంగా ఈ కేసుని ఎదుర్కోవాలని అనుకుంటున్నాం. ఒక తల్లిగా తన కుటుంబం, పిల్లలను దృష్టిలో పెట్టుకొని అసత్య కథనాలు ప్రచురించొద్దని కోరింది. గత 29ఏళ్లుగా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, చట్టాలకు లోబడి పైకొచ్చిన ప్రొఫెషినల్ గా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్న. మీడియా విచార‌ణ‌ను తాము కోరుకోవ‌డం లేద‌ని, చ‌ట్టం త‌న‌ప‌ని తాను చేసుకునేలా మ‌నం వ్య‌వ‌హ‌రించాల‌ని స‌త్య‌మేవ జ‌య‌తే అంటూ ఇన్‌స్టా పోస్ట్‌ను ముగించారు శిల్పాశెట్టి. ఇక తన వివరణ మొత్తంలో కేవలం తన గొప్పతనాన్ని చెప్పుకున్న శిల్పా శెట్టి ఎక్కడ కూడా భర్త చేసింది తప్పు అని కానీ, తన భర్త నిర్దోషి అని కానీ ఎక్కడ చెప్పకపోవటం గమనార్హం. రాజ్ కుంద్రా తప్పుచేసాడని చెప్పడానికి శిల్పా వివరణనే ఒక సాక్షం అంటున్నారు నెటిజన్స్. ఇక తనపై కథనాలు రాకుండా కోర్టు నుండి ఉత్తర్వులు తెచ్చుకోవటం కూడా అనుమానాలకు తావిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.