భర్త చేసిన నీచపు పనికి ఇక రాదనుకున్నారు. కానీ మళ్లీ వచ్చేసింది. పవర్ ఫుల్ మెసేజ్ ఇచ్చేసింది.

బాలీవుడ్ భామ శిల్పాశెట్టి మళ్లీ సూపర్ డ్యాన్సర్-4 రియాలిటీ షో లో కనిపించనుంది. భర్త రాజ్ కుంద్రా నీలిచిత్రాలు తీస్తూ అడ్డంగా దొరికిపోవటంతో శిల్పా శెట్టి కొన్ని రోజులు సూపర్ డ్యాన్సర్ షో లో కనిపించలేదు. దీంతో రకరకాల పుకార్లు షికారు చేశాయి. భర్త చేసిన నీచపు పనికి ఆమెను సోనీ టీవీ వాళ్లు జడ్జిగా తీసేశారని..కొంతమందేమో ముఖం చెల్లక ఆమె షో నుంచి తప్పుకుందంటూ కామెంట్లు చేశారు. దాదాపు 5, 6 వారాలు ఆమె ఈ షో లో కనిపించకపోవటంతో ఇక శిల్పా పర్మినెంట్ గా ఫేడ్ అవుట్ అయినట్టేనని అంతా భావించారు.

కానీ మళ్లీ వచ్చేసింది

ఐతే శిల్పా మాత్రం భర్త చేసిన పనితో నాకేంటీ సంబంధం అన్నట్లుగా మళ్లీ బ్యాక్ టు వర్క్ అంటూ వచ్చేసింది. నెలన్నర తర్వాత శిల్పా మళ్లీ సెట్ లో అడుగుపెట్టింది. ఇటీవలే ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ జరిగింది. అందుకు సంబంధించిన ఫోటో షూట్ ను శిల్పాశెట్టి తన ఇన్ స్టా లో షేర్ చేసింది. దీంతో మళ్లీ షో లో అడుగుపెట్టబోతున్నానంటూ చెప్పకనే చెప్పేసింది.

పవర్ ఫుల్ మెసేజ్

శిల్పా షేర్ చేసిన పిక్ లో చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. నీలం-ఊదా రంగుల క‌ల‌బోత‌తో ఉన్న చీర‌లో ఆమె మెరిసిపోతోంది. అంతేనా ఈ పోస్ట్ తో పాటు పవర్ మెసేజ్ కూడా ఇచ్చింది. ‘దేర్ ఈజ్ నో ఫోర్స్ మోర్ ప‌వ‌ర్‌ఫుల్ దేన్ ఎ విమెన్ డిట‌ర్మైండ్ టు రైజ్’ అంటూ పోస్ట్ పెట్టింది. ఎదగాలనుకునే మ‌హిళను ఏ ఫోర్స్ ఆపలేదని ఆమె తెలిపింది. దీంతో శిల్పా ధైర్యం, పనిపట్ల కమిట్ మెంట్ చూసి నెటిజన్లు శభాష్ అంటున్నారు.