రాజ్ కుంద్రా ఏం చేస్తున్నాడో.. ఏం చేసేవాడో నాకు తెలియదు

Shilpa Shetty Submits Her Statement About Raj Kundra Issue
Shilpa Shetty Submits Her Statement About Raj Kundra Issue
Shilpa Shetty Submits Her Statement About Raj Kundra Issue
Shilpa Shetty Submits Her Statement About Raj Kundra Issue

పోర్న్ వీడియోల కేసులో అరెస్టైన రాజ్ కుంద్రా ఇప్పుడెక్కడున్నాడో.. ఏం చేస్తున్నాడో నా దగ్గర ఎలాంటి సమాధానం లేదంటూ కామెంట్స్ చేసింది బాలీవుడ్ నటి, రాజ్ కుంద్రా సతీమణ శిల్పాశెట్టి. పోర్న్ వీడియోల కేసులో శిల్పాశెట్టి పేరును కూడా ముంబై పోలీసులు చార్జీషీటులో చేర్చారు. ఆమె స్టేట్ మెంట్ కూడా రికార్డు చేశారు. షూటింగులు, సినిమాలతో బిజీగా ఉండేదాన్నని.. నాకు అంత తీరిక ఉండేది కాదు. రాజ్ కుంద్రా ఏం చేస్తున్నాడో ఎప్పుడూ గమనించలేదు. పట్టించుకోలేదు అంటూ శిల్పాశెట్టి పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఈ కేసులో 1400 పేజీల చార్జిషీటును సిద్ధం చేసిన పోలీసులు శిల్పాశెట్టి నుంచి మరింత సమాచారం సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. హాట్ షాట్స్, బాలీఫేమ్ యాప్స్ గురించి తనకు తెలియదని శిల్పాశెట్టి చెప్పిందని ముంబై పోలీసులు తెలిపారు.

Shilpa Shetty Submits Her Statement About Raj Kundra Issue
Shilpa Shetty Submits Her Statement About Raj Kundra Issue

పోర్న్ వీడియోల కేసు వెలుగు చూసిన తర్వాత గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ ప్లే స్టోర్ హాట్ షాట్స్ యాప్ ను డిలీట్ చేశాయి. ఆ తర్వాత బాలీఫేమ్ యాప్ వార్తల్లోకి వచ్చింది. ఈ పోర్న్ రాకెట్ ను నడిపించేందుకు రాజ్ కుంద్రా బాలీవుడ్ ఇండస్ట్రీని బాగా వాడుకున్నాడని, వియాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిసరాలను ఉపయోగించుకున్నాడని పోలీసులు తెలిపారు. జులై 19న పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన పోలీసులు రెండు నెలలుగా విచారిస్తున్నారు. అయితే.. రాజ్ కుంద్రా మాత్రం తాను చేసేది పోర్న్ కాదని.. సినిమాలేనని వాదిస్తున్నాడు. ముంబై కోర్టు ఈ కేసులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదో చూడాలి.