నా భర్త చేసింది తప్పే కాదు.. పోలీసులకి షాక్ ఇస్తున్న శిల్పాశెట్టి! - TNews Telugu

నా భర్త చేసింది తప్పే కాదు.. పోలీసులకి షాక్ ఇస్తున్న శిల్పాశెట్టి!Shilpa Shetty Supports Husband Raj Kundra In Porn Scandal
Shilpa Shetty Supports Her Husband Raj Kundra In Porn Scandal

పోర్న్ ఫిలిం కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా అరెస్ట్ కావటం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో రాజ్ కుంద్రాని జులై 27వరకు విచారించాలని చెప్పిన కోర్టు లేటెస్ట్ గా కుంద్రాకి షాక్ ఇస్తూ మరో 14 రోజుల జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీని పొడిగించింది. అయితే పోర్న్ వీడియో మేకింగ్ కేసులో రాజ్ కుంద్రాని జూహులోని తన ఇంటికి తీసుకొని వెళ్లి శిల్పా శెట్టితో ముఖాముఖీగా కూర్చోబెట్టి విచారించారట పోలీసులు.ఈ విచారణలో శిల్పాశెట్టి చేసిన రచ్చ మాములుగా లేదని తెలుస్తుంది.త‌న భ‌ర్త యాప్ హాట్‌షాట్స్‌తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ఆమె స్ప‌ష్టం చేసిందట. పోలీసుల ముందే గట్టిగ అరుస్తూ, ఏడుస్తూ, భర్తతో వాగ్వివాదానికి దిగిందని తెలుస్తుంది.

అయితే మొదట్లో పోలీసులు ఇంట్లోకి రాగానే భర్తని చూసి బోరున ఏడుస్తూ, కుంద్రాతో గొడవకి దిగిందట శిల్పాశెట్టి. ఒక దశలో తీవ్ర ఎమోషనల్ అవుతున్న శిల్పాని పోలీసులు కంట్రోల్ చేసి ఇన్విస్టిగేషన్ స్టార్ట్ చేసారట. ఇందులో క్రైమ్ బ్రాంచ్ అధికారులకి షాక్ ఇస్తూ, భర్తని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేసిందట శిల్పాశెట్టి. తన భర్త తీసింది పోర్న్ ఫిలిం కాదని.. అది ఎరోటిక్ కంటెంట్ అని.. పోర్న్ కి ఎరోటిక్ కి చాలా వ్యత్యాసం ఉంటుందని.. కాస్త శృంగారం ఎక్కువ‌గా ఉండే వీడియోలో తీస్తుంటాడని శిల్పా చెప్పిందట. ఇక ఎన్నో ప్రముఖ ఓటిటి ఛానెల్స్ లో ఇంతకంటే దారుణమైన వీడియోలు ఉంటాయని, వాటితో పోల్చుకుంటే రాజ్ కుంద్రా చేసే వీడియోస్ చాలా బెటర్ అంటూ భర్తని వెనుకేసుకొచ్చిందట శిల్పాశెట్టి.

ఇక దాదాపు రెండు గంటల వాంగ్మూలాన్ని పోలీసులు శిల్పాశెట్టి నుండి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ క్రమంలో పోర్నోగ్రఫీ ఇష్యులో శిల్పా శెట్టి హస్తం కూడా ఉండొచ్చని, చాలా విషయాలు భార్యకి తెలిసే జరిగాయని ఆమె మాట్లాడిన తీరు చూసి క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఓ ప్రాధమిక అవగాహనకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక రాజ్ కుంద్రాకి చెందిన వియాన్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలో ఆయన దగ్గర పని చేసే ఉద్యోగులు కూడా కుంద్రాకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చినట్లుగా సమాచారం.దీంతో రాజ్ కుంద్రాపై మరింత ఉచ్చు బిగుసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా రోజుకో ట్విస్ట్ తో రాజ్ కుంద్రా పోర్న్ ఫిలిం కేసు మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తుంది.