బీజేపీకి ప్రధాని పదవిని వదిలిపెట్టింది మేమే: సంజయ్‌ రౌత్‌

sanjay roth

బీజేపీకి ప్రధాని పదవిని వదిలిపెట్టింది తామేనని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. హిందుత్వ సిద్ధాంతాన్ని శివసేన ఎప్పుడూ అధికారం కోసం వాడలేదంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలను ఆయన పూర్తిగా సమర్ధించారు. మహారాష్ట్రలో ఎక్కడో అడుగున ఉన్న బీజేపీని ఉన్నత స్థాయికి తీసుకువచ్చిన ఘనత శివసేనదేనన్నారు. సోమవారంనాడు మీడియాతో మాట్లాడుతూ సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

”బాబ్రీ ఉదంతం తర్వాత ఉత్తర భారతదేశంలో శివసేన పవనాలు బలంగా వీచాయి. అలాంటి దశలోనే మేము ఎన్నికలకు వెళ్లి ఉంటే మా పార్టీకి చెందిన వ్యక్తే ప్రధానిగా దేశాన్ని ఏలి ఉండేవారు. అయితే, ఆ అవకాశాన్ని మేము బీజేపికి ఇచ్చాం” అని సంజయ్ రౌత్ అన్నారు. అధికారం కోసమే హిందుత్వను బీజేపీ వాడుకుంటోందని విమర్శించారు.