బాబర్ కంటే వార్నర్ తోపా.. షోయబ్ అక్తర్ అనుచిత వ్యాఖ్యలు.. బుద్ది పోనిచ్చుకోలేగా..!

Shoib Akthar Shocking Comments On ICC Pleyer OF The Tournament Award
Shoib Akthar Shocking Comments On ICC Pleyer OF The Tournament Award

2007 నుండి ఊరిస్తున్న పొట్టి ప్రపంచ కప్ ని ఎట్టకేలకి ఎగరేసుకుపోయింది ఆస్ట్రేలియా. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో సునాయాస విజయంతో తొలిసారి ఐసీసీ టి20 వరల్డ్ కప్ గెలువగా.. ఈ విజయంలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ అత్యంత కీలక భూమిక పోషించింది.173పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన ఆసీస్ టీమ్ ఎక్కడ తడపడకుండా ఛేజ్ చేయడానికి డేవిడ్ వార్నర్ విధ్వంసకర ఇన్నింగ్సే కీలకం. 3సిక్సులు, 4ఫోర్లతో కేవలం 38బంతుల్లో 53 పరుగులు చేసి.. మిచెల్ మార్ష్ కి మార్గం సులభం చేశాడు వార్నర్. ఇక పాకిస్తాన్ తో జరిగిన సెమి ఫైనల్ లోను విధ్వంసకర బ్యాటింగ్ తో పాక్ బౌలర్లకి చుక్కలు చూపెట్టాడు వార్నర్. మేము తోపులమని చెప్పుకున్న పాకిస్తాన్ టీమ్ కి భారీ షాక్ ఇస్తూ ఆడిన వార్నర్ ఇన్నింగ్స్ అద్బుతమనే చెప్పొచ్చు. టీమిండియాతో గెలవగానే.. వరల్డ్ కప్ మాదే అని విర్రవీగిన పాకిస్తాన్ ని ఇంటికి పంపిన వార్నర్ పై షోయబ్ అవమానకర కామెంట్స్ చేశాడు.

ఇక వరుసగా సెమీఫైనల్, ఫైనల్ లో రాణించి.. ఆస్ట్రేలియాకి కప్ అందించిన వార్నర్ ని ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ప్రకటించింది ఐసీసీ. అయితే డేవిడ్ వార్నర్ ఆ అవార్డుకి అర్హుడు కాదని, బాబర్ అజమ్ కి అవార్డు దక్కుతుందనుకున్నామని షోయబ్ వ్యాఖ్యానించాడు. ట్విట్టర్ వేదికగా స్పందించిన అక్తర్‌.. “ఇది అసలు సరైన నిర్ణయం కాదు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ బాబర్ ఆజమ్ కు ఇస్తారాని ఎదురు చూశాను. ఇదైతే కచ్చితంగా అన్యాయమే “అంటూ ట్వీట్ చేశాడు. ఎందుకంటే.. ఈ టోర్నీలో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజాం కూడా అద్బుతంగా రాణించాడు. ఈ ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌లలో 303 పరుగులు చేసిన బాబర్‌ ఆజాం.. అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఉన్నాడు. మరోవైపు వార్నర్.. ఏడు ఇన్నింగ్స్‌లలో 289 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అత్యధిక పరుగులు చేసిన బాబర్‌కు అవార్డు ఇవ్వకుండా వార్నర్‌కు ఎలా ఇచ్చారాని ఐసీసీపై అక్తర్‌ మండి పడ్డాడు.