తొలిటెస్టులోనే సెంచరీ బాదిన శ్రేయాస్ అయ్యర్

న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ తో లాంగ్ క్రికెట్ లో ఆరంగ్రేటం చేసిన టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ తొలి మ్యాచ్ లోనే శతకం బాదాడు. ఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్ లోనే మూడంకెల స్కోర్ కొట్టి ప్రశంసలందుకుంటున్నాడు.


తొలి టెస్టు తొలిరోజు జడేజా, శ్రేయాస్ కలిసి ఐదో వికెట్ కు వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా జడేజా 50 పరుగులు, శ్రేయాస్ 75 పరుగులు చేశారు. తొలిరోజు ఆట ముగిసే సరికి టీమిండియా స్కోరు 258/4 గా ఉంది. రెండోరోజు బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఫోర్లతో విరుచుకుపడి తొలి టెస్టులోనే సెంచరీ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు.